ఇటీవల కాలంలో సినిమాలను చూసే విధానంలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. ఎంత పెద్ద స్టార్ హీరోల సినిమాలైనా చూసేందుకు ఆయా హీరోల ఫ్యాన్స్ మాత్రమే ఎక్కువగా వెళ్తున్నారు. అదీగాక కంటెంట్ ఉన్న సినిమా అని తెలిస్తేనే.. ఫ్యామిలీ ఆడియెన్స్ ఇళ్లలో నుండి థియేటర్లవైపు అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా ఓటిటిలు వచ్చాక సినిమాలు థియేటర్లలో చూడటం తగ్గించేశారు ప్రేక్షకులు. ఎందుకంటే.. ఎన్ని సినిమాలు విడుదలైనా.. నెల రెండు నెలలకే ఓటిటిలోకి వచ్చేస్తున్నాయి. ఇదిలా ఉండగా.. ప్రతి వారంలాగే ఈ వారం కూడా థియేట్రికల్ రిలీజ్ కి చాలా సినిమాలు రెడీ అయ్యాయి. డిసెంబర్ మొదటి శుక్రవారం.. ఆంటే 2వ తేదీన దాదాపు 16 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.
ఇక ఒకే వారం ఇన్ని సినిమాలు తెరపైకి వస్తుండటంతో ఆయా భాషలకు చెందిన ప్రేక్షకులు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. తెలుగులో కూడా పలు సినిమాలు డబ్ అయి రిలీజ్ అవుతున్నాయి. ఇప్పటికైతే తెలుగులో హిట్ 2 సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి పైన పేర్కొన్న సినిమాలలో మీరు ఏ సినిమా కోసం ఎదురు చూస్తున్నారో కామెంట్స్ లో తెలియజేయండి.