హైదరాబాద్ : వేసవికాలంలో ఆరోగ్యానికి మేలు చేసే పండ్లలో పుచ్చకాయ ప్రధానమైంది. ఇది వేసవి తాపాన్ని తగ్గించి, శరీరానికి మరింత ఉత్తేజాన్ని కలిగిస్తుంది. ఈ పండును తినడం వల్ల డీహైడ్రేషన్ సమస్య నుంచి ఉపశమనం పొందొచ్చు. అందుకే సమ్మర్ వచ్చిందంటే వీటికి మస్త్ గిరాకీ ఉంటుంది. అయితే మంచి పుచ్చకాయలని కనుక్కోడానికి కొన్నిరకాల గుర్తులున్నాయి. అవి ఎలా ఉంటాయో ఖచ్చితంగా తెలుసుకోవాలి..లేదంటే అమ్మేవాళ్లు చెప్పిన కాయలు కొని ఒక్కోసారి మోసపోవాల్సి వస్తుంది. అందుకోసమే ఆయా గుర్తులను బట్టి కొన్ని పుచ్చకాయలను కొనుగోలు చేయాలి. అవి ఎలా ఉంటాయో తెలుసుకోవాలంటే ఈ కింది వీడియోను చూడండి.