స్టార్ ప్లేయర్లు ఎప్పుడూ ట్రెండింగ్ లోనే ఉంటారు. వారేం చేసినా కెమెరాలు అన్ని వారిని కనిపెట్టుకొని ఉంటాయి. కోహ్లీ కూడా అలాంటి స్టార్ డం కలిగిన ప్లేయర్ అని అందరికీ తెలుసు.అయితే కోహ్లీతో గొడవ ద్వారా నవీన్ ఉల్ హక్ పేరు ప్రస్తుతం ప్రపంచమంతటా తెలిసిపోయింది.
నవీన్ ఉల్ హక్ నెల క్రితం వరకు ఈ పేరు పెద్దగా ఎవరికీ తెలియకపోవచ్చేమో గాని ప్రస్తుతం ఈ పేరు మన దేశంలో మారు మ్రోగుతుంది. ఐపీఎల్ లో అరంగ్రేటం చేసినప్పటినుంచి ఈ ఆఫ్ఘనిస్తాన్ పేసర్ రోజు వార్తల్లో నిలుస్తూనే వస్తున్నాడు. దానికి కారణం భారత్ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎవరూ లేన్నట్లుగా నవీన్.. కోహ్లీనే టార్గెట్ చేయడం ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ గా మారింది. తాజాగా నిన్న ముంబై మీద జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో కూడా నవీన్ ఉల్ హక్ ఎప్పటిలాగే మరోసారి సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచాడు. అయితే నవీన్.. కోహ్లీతో గొడవ పెట్టుకోవడం అతనికి కలిసొస్తుందనే చెప్పాలి.
స్టార్ ప్లేయర్ ఎప్పుడూ ట్రెండింగ్ లోనే ఉంటారు. వారేం చేసినా కెమెరాలు అన్ని వారిని కనిపెట్టుకొని ఉంటాయి. కోహ్లీ కూడా అలాంటి స్టార్ డం కలిగిన ప్లేయర్ అని అందరికీ తెలుసు. కోహ్లీలా ట్రెండింగ్ లో నిలవాలంటే దానికి రెండే మార్గాలున్నాయి. ఒకటి అత్యున్నత ఆతని ప్రదర్శించాలి. లేకపోతే కోహ్లీతో గొడవ పెట్టుకోవాలి. నవీన్ ఉల్ హక్ వీటిలో రెండో రకం. ఏకంగా కోహ్లీతోనే కయ్యానికి దువ్వి అందరి దగ్గరనుండి విమర్శలు మూటగట్టుకుంటున్నాడు. ప్రస్తుతం నవీన్ ఉల్ హక్ ఐపీఎల్ లో లక్నో సూపర్ జయింట్స్ తరపున ఆడుతున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తో జరిగిన మ్యాచులో కోహ్లీతో గొడవపెట్టుకొని వార్తల్లో నిలిచాడు.
ఇక అంతటితో ఆగకుండా కోహ్లీ ఔటైన ప్రతిసారి పరోక్షంగా కోహ్లీ మీద సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తూ కనిపించాడు. ఎంతో అగ్రెస్సివ్ గా ఉండే కోహ్లీ.. కాస్త సైలెంట్ అయినా నవీన్ మాత్రం ప్రతిసారి ఇలా కామెంట్స్ చేయడం కోహ్లీకే కాదు అతని ఫ్యాన్స్ కి కూడా నచ్చలేదు. దీంతో నవీన్ గ్రౌండ్ లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో కోహ్లీ ఫ్యాన్స్ కోహ్లీ పేరుని జపిస్తూనే ఉన్నారు. లక్నో ఎక్కడ మ్యాచ్ ఆడినా కోహ్లీ ఫ్యాన్స్ ఇలాగే చేశారు. దీంతో నవీన్ కోహ్లీతో గొడవ కారణంగా ఈ పేరు ఇప్పుడు అందరికీ తెలిసింది. అయితే ఎన్ని విమర్శలు మూటగట్టుకున్నా.. ఒక విషయంలో మాత్రం నవీన్ కి మంచి జరిగిందనే చెప్పాలి.
నవీన్ ఉల్ హక్ కి గొడవలు కొత్తేమి కాదు. గతంలో పాకిస్థాన్ సూపర్ లీగ్ లో షాహిద్ ఆఫ్రిది తో ఈ పేసర్ గొడవ పెట్టుకున్నాడు. అంతే కాదు బిగ్ బాష్ అదేవిధంగా ఇతర లీగ్ ల్లో కూడా నవీన్ గొడవ పెట్టుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. ఎన్ని గొడవలు పెట్టుకున్నా.. నవీన్ పేరు మొన్నటివరకు తెలియదు. కానీ ఎప్పుడైతే కోహ్లీతో గొడవ పెట్టుకున్నాడా అప్పటినుంచి ఈ పేరు అందరికీ తెలిసిపోయింది. కోహ్లీతో గొడవపెట్టుకొని మరీ ఫేమస్ అయిపోయాడు ఈ అఫ్గఅనిస్తాన్ పేసర్. ప్రపంచంలో దాదాపు అన్ని లీగ్ ల్లో ఆడుతున్న నవీన్.. ప్రస్తుతం ప్రపంచమంతటా తన పేరు తెలిసిపోయింది. కోహ్లీ.. ఫాలోయింగ్ అంటే ఇలాగే ఉంటుంది అని చెప్పడానికి ఇంతకంటే ఇంకేం కావాలి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైనా లీగ్ లో నవీన్ కి కెప్టెన్సీ ఇచ్చిన ఆశ్చర్యపోనవసరం లేదు. మొత్తానికి కోహ్లీ మీద గొడవతో పాపులర్ అయిన నవీన్ కెరీర్ ముందు ముందు ఎలా ఉంటుంది చూడాలి. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.