మీరు టూత్ పేస్ట్ వాడుతున్నారా? అయితే దిమ్మతిరిగే వార్త మీ కోసమే. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతీ రోజు ఉదయాన్నే లేవటం ముందుగా బ్రష్ చేసుకోవటం వంటివి మనం క్రమంగా తప్పకుండా చేస్తాం. కానీ ఇక్కడే మనకు తెలియకుండా రోగాల భారిన పడుతున్నామని వైద్యులు తట్టిలేపుతున్నారు. అవును మీరు విన్నది నిజమే. ప్రతీ రోజు బ్రష్ చేయటానికి వాడే టూత్ పేస్ట్ లో చాలా ప్రమాదం పొంచి ఉండే అస్థిపంజర ఫ్లోరోసిస్ వంటి తీవ్రమైన వ్యాధి రావచ్చని ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యులు తేల్చిచెప్పారు.
బ్రష్ తో పళ్లు శుభ్రం చేసే క్రమంలో వచ్చే నురగ మెల్ల మెల్లగా నోట్లోకి వెళ్లటం జరుగుతుంది. దీంతో దంతాలు దెబ్బతిని శరీరం బలహీనంగా మారుతుందని చెబుతున్నారు. మరీ ముఖ్యంగా 6 సంవత్సరాల వయసు కన్న పిల్లల విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రధానంగా పిల్లలకు డెంటల్ ఫ్లోరోసిస్ వచ్చే అవకాశం ఉందని తెలుపుతున్నారు. దీని కారణంగా దంతాలు పసుపు రంగులో మారటం, కీళ్లను ప్రభావితం చేయటం, వీపు, భుజాలు బలహీనంగా మారే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి ప్రమాదాలకు గురి కాకుండా బ్రష్ చేసే క్రమంలో బఠానీ గింజంత పెస్ట్ ఉపయోగిస్తే సరిపోతుందని వైద్యులు సూచిస్తున్నారు.