వయసుతో సంబంధం లేకుండా అందరినీ ఇబ్బంది పెడుతున్న సమస్య మోకాళ్ల నొప్పులు.ఒకప్పుడు కేవలం వయసు మళ్ళిన వాళ్లను మాత్రమే ఇబ్బంది పెట్టే ఈ సమస్య ఇప్పుడు అన్ని వయసుల వాళ్లలో కనిపిస్తుంది. మంచినీళ్లు తక్కువగా తాగడం, మసాలాలు ఎక్కువగా తీసుకోవడం, విపరీతంగా ఆలోచించడం అనేవి మోకాళ్ల నొప్పులకు ప్రధాన కారణాలుగా నిపుణులు చెబుతారు. అదే విధంగా ఏసీ లో ఎక్కువగా గడపడం కూడా మోకాళ్ల నొప్పులకు ఒక ముఖ్యకారణం. ఎందుకంటే, కృత్రిమ గాలిని మన శరీరం స్వీకరించలేకపోవడం వల్ల నొప్పులు వస్తాయి.
మన శరీరం డీ హైడ్రేట్ కావడం వల్ల మోకాళ్ల నొప్పులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి,డీ హైడ్రేషన్ నుంచి శరీరాన్ని కాపాడే ఆహారాన్ని తీసుకోవడం చాలా అవసరం. బెండకాయ..మనల్ని డీ హైడ్రేషన్ నుంచి కాపాడే ఒక ముఖ్యమైన పదార్ధం. శరీరానికి సున్నితత్వాన్ని కల్పించి,పొడిబారిన చర్మానికి తేమను కలిగిస్తుంది. అయితే,బెండకాయని కూరగా వండుకోవడం మాత్రమే కాదు..జ్యూస్ గా చేసుకుని తాగొచ్చు కూడా. ఓ మూడు,నాలుగు బెండకాయలు,కొంచెం మంచినీళ్లు లేదా మజ్జిగ,వాటికి ఒక అల్లం ముక్క కలిపి,బాగా మిక్స్ చేసి,ఆ మిశ్రమానికి మిరియాల పొడి కలుపుకుని తాగాలి.ఈ జ్యూస్ మోకాళ్ల నొప్పులు ఉన్నవాళ్లకు మాత్రమే కాదు.. బాగా సన్నగా ఉన్నవాళ్లకు కూడా ఉపయోగపడుతుంది. ఇది తాగడం వల్ల బలంగా తయారవుతారు.
ఎముకల్లో పటుత్వం తగ్గిపోవడం కూడా మోకాళ్ల నొప్పులకు ఒక కారణం. ఇది కాల్షియం లోపం వల్ల జరుగుతుంది. కాబట్టి, ఎముకల్లో శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవాలి. వీటిలో ముఖ్యమైనవి నువ్వులు. నువ్వుల్లో ఉండే పోషకాలు ఎముకల్ని బలపరుస్తాయి. కాబట్టి,నువ్వుల నూనెను వాడటం చాలా ఉపయోగకరం. సూర్యరశ్మి తగినంతగా అందకపోవడం వల్ల కూడా మోకాళ్ల నొప్పులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి,సూర్య నమస్కారాలు చేయడం అలవాటు చేసుకోవాలి. వయసు మళ్ళిన వాళ్లు కూడా ఇవి చేయొచ్చు. సూర్య నమస్కారాలు చేయడం వల్ల శరీరానికి సూర్యకాంతిలోని శక్తి అంది,ఎముకలు బలంగా తయారవుతాయి.దీంతో నొప్పుల సమస్య తగ్గే అవకాశముంది.కాబట్టి, యోగాసనాలను దినచర్యలో భాగంగా చేసుకోవడం చాలా మంచిది.
సరైన పోషకాహారం తీసుకోవడం, సక్రమమైన జీవన శైలిని అలవరచుకోవడం ద్వారా మోకాళ్ల నొప్పుల్ని నయం చేసుకోవచ్చు. కాబట్టి,ఆహారపు అలవాట్లు,లైఫ్ స్టైల్ లో మార్పుల మీద సరిగా దృష్టి కేంద్రీకరించి, తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్య నుంచి బయట పడొచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో చూడండి..