నిత్య జీవితంలో ఎదురయ్యే చాలా రకాల అనారోగ్య సమస్యలకు మన ప్రకృతిలో లభించే వివిధ పదార్ధాల్లో పరిష్కారం ఉంది. ముఖ్యంగా ప్రతి కిచెన్లో తప్పనిసరిగా లభ్యమయ్యే ఈ గింజల్ని క్రమం తప్పకుండా రెండు వారాలు తీసుకుంటే ఊహించని అద్భుతాలు జరుగుతాయి. శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో తెలుసుకుందాం.
ప్రతి ఇంట్లో లభ్యమయ్యే వివిధ రకాల వస్తువుల్లో మెంతులు కీలకమైనవి. సాధారణంగా వీటిని వంటల్లో రుచి కోసం వినియోగిస్తుంటారు. కానీ వైద్యపరంగా చూస్తే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఎందుకంటే ఇందులో పోషక విలువలు చాలా ఎక్కువ. ముఖ్యంగా ఫైబర్, ప్రోటీన్లు, ఐరన్, కాల్షియం, సోడియం, పొటాషియం, విటమిన్ డి, విటమిన్ సి వంటి పోషకాలు కావల్సినంత లభిస్తాయి. రోజూ క్రమం తప్పకుండా ఉదయం పరగడుపున ఈ మెంతి గింజలు తీసుకుంటే శరీరంలో అద్భుతమైన మార్పులు గమనించవచ్చంటున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు. ఆ మార్పులేంటో చూద్దాం.
మెంతి గింజల్లో ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల శరీరంలో రక్తహీనత సమస్య పోతుంది. ఇందులో పెద్దమొత్తంలో ఉండే పైబర్ కారణంగా బ్లడ్ షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. అందుకే డయాబెటిస్ వ్యాధిగ్రస్థులకు మెంతులు అద్భుతంగా పనిచేస్తాయంటారు. ఓ రకంగా చెప్పాలంటే డయాబెటిస్ రోగంలో వాడే మెటఫార్మిన్కు ఇది ప్రత్యామ్నాయంగా భావిస్తారు. ఇదే ఫైబర్ కారణంగా పేగుల్లో పేరుకున్న కొలెస్ట్రాల్ కరుగుతుంది. ఫలితంగా గుండె జబ్బుల సమస్యకు చెక్ పడుతుంది.
మెంతి గింజల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అందుకే జీర్ణక్రియ మెరుగుపడి మలబద్ధకం వంటి కడుపు సంబంధిత సమస్యలు దూరమౌతాయి. రోజూ ఒక చెంచా మెంతి గింజల్ని రాత్రి వేళ నీళ్లలో నానబెట్టి ఉదయం ఆ నీళ్లను గింజలతో సహా తీసుకోవాలి. ఇలా ఓ నెలరోజులు క్రమం తప్పకుండా పాటిస్తే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. అయితే కొందరిలో మెంతులు అలెర్జీ వంటి సమస్యలకు కారణమౌతుంది. అందుకే అలెర్జీ సమస్యలున్నవాళ్లు వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది.