సంక్రాంతి పండుగను జరుపుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు సిద్ధమవుతున్నారు. జీవనోపాధి కోసం ఒక్కడెక్కడో స్థిరపడిన వారు సైతం.. సంక్రాంతి పండుగ అనగానే సొంతూళ్లకు పయనమవుతారు. చిన్నచిన్న కుటుంబాలుగా విడిపోయినా.. ఈ పండుగను మాత్రం ఉమ్మడిగా చేసుకునే వారు చాలా మందే ఉన్నారు. రంగురంగుల ముగ్గులు, గాల్లో ఎగిరే పంతంగులు, ఘుమఘుమలాడే పిండి వంటలతో పాటు కొన్ని ప్రాంతాల్లో కోడి పందెలతో ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్లిపోతారు. అయితే.. ఈ పండుగ ఎంత సరదాగా గడుస్తుందో.. అంతకంటే పవిత్రమైన పనులు చేయాల్సినవి చాలానే ఉంటాయి. తలస్నానం, సూర్య దేవుని పూజలు, దాన ధర్మాలు చేయాల్సి ఉంటుంది. వీటితో పాటు పండుగ పూట చేయకూడని పనులు కూడా కొన్ని ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
మకర సంక్రాంతి రోజున తల స్నానం చేశాకే ఆహార పానియాలు తీసుకోవాలి. మర్చిపోయి కూడా తలస్నానం చేయకుండా.. తల స్నానం చేయకుండా ఏదీ తీసుకోవద్దు. ఈ పండుగ రోజున మందు తాగడం, మాంసాహారం తినడం వంటివి చేయకూడదు. తల స్నానం చేసిన తర్వాత.. నిల్వ ఉంచిన ఆహారాన్ని మకర సంక్రాంతి రోజున అస్సలు తినకూడదు. ఈ చేయకూడని పనులు చేయడం వలన మీపై ప్రతికూల శక్తులు ప్రభావం చూపే అవకాశం ఉంది. కేవలం సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి.
అలాగే మకర సంక్రాంతి వంటి పర్వదినాన ఎవరితోనూ అనవసరంగా గొడవలకు దిగొద్దు.. ఎవరైనా కావాలని రెచ్చగొట్టినా.. కోపాన్ని దిగమింగుకోవాలి. అనవసరంగా కోపం తెచ్చుకుని, గొడవలకు, ఘర్షణలకు దిగితే.. మీపై ప్రతికూల ప్రభావం పెరుగుతుంది. దీని వల్ల మీ ఎదుగుదలకు అడ్డంకులు ఏర్పడతాయి. అందుకని.. సంబురాలు చేసుకునే సంక్రాంతి నాడు ఎలాంటి ఘర్షణలు దిగకుండా.. చాలా సరదా సరదాగా గడిపేయండి. ఎవరితోనూ చెడుగా మాట్లాడొద్దు. వీలైనంత మేరకు చాలా ప్రశాంతంగా ఉండండి. ఇలా సంక్రాంతి రోజు కొన్ని చేయకూడని పనులకు దూరంగా ఉండి.. శాస్త్రం ప్రకారం చేయాల్సిన మంచి పనులు చేస్తే.. మీకు ఎంతో శుభం కలుగుతుందని ధార్మిక గురువులు చెబుతున్నారు.