ఆడవారిలో శరీరంలో జరిగే కొన్ని ప్రక్రియల వల్ల పీరియడ్స్ అవుతూ ఉంటుంది. ఆ సమయంలో మహిళలు, యువతులు అనేక రకాల సమస్యలతో బాధపడుతు ఉంటారు. నెలసరి జరిగిన రోజు కడుపులో విపరీతమైన నొప్పిగా ఉండడం, రెండు మూడు రోజులు నీరసంగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఇక ఆ సమయాల్లో మహిళలు ఏం పని చేయలన్న శరీరంలో తగినంత శక్తి ఉండదు. రెండు మూడు రోజుల వరకు కాళ్లు లాగినట్లు కూడా అనిపిస్తుంది. ఇలా పీరియడ్స్ సమయంలో స్త్రీలు నరకాన్ని చూస్తారని వైద్యులు చెబుతుంటారు. అయితే ఈ నెలసరి సమయంలో స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఆ సమయంలో దీపారాధన చేయవచ్చా? చేస్తే ఎన్ని రోజుల తర్వాత చేయాలనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
స్త్రీల శరీరంలో జరిగే కొన్ని ప్రక్రియల వల్ల స్త్రీలకు నెలసరి జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో స్త్రీలు అనే రకాల ఇబ్బందులను ఎదుర్కోవడంతో పాటు మరెన్నో సమస్యలకు గురువుతుంటారు. ఈ సమయంలోనే స్త్రీలు దీపారాధన చేసే విషయంలో వారికి అనేక సందేహాలు కలుగుతుంటాయి. నెలసరి జరిగిన నాలుగు రోజుల తర్వాత దేవుడికి పూజ చేస్తే సరిపోతుందని చాలా మంది స్త్రీలు అనుకుంటూ ఉంటారు. కానీ నెలసరి తర్వాత నాలుగు రోజులకే పూజ చేయడం కరెక్ట్ పద్దతి కాదని, అలా చేస్తే దైవానికి అపచారం చేసిన వాళ్లు అవుతారని నిపుణులు అంటున్నారు. ప్రధానంగా దేవుడికి అపచారం చేయకుండా ఉండాలంటే నెలసరి సమయంలో స్త్రీలు 7 పగలు, 7 రాత్రుళ్లు దైవారాధన అసలే చేయరాదు.
దీంతో పాటు తులసి ఆరాధన, దీపారాధన కూడా చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఈ సమయంలో దాదాపుగా 7 రోజుల పాటు స్త్రీలు సుచి శుభ్రతలు పాటిస్తూ దేవుడికి దూరంగా ఉండాలని చెబుతున్నారు. ఇలా కాదని చాలా మంది స్త్రీలు 4,5 రోజులకే దేవుడికి దీపారాధన చేస్తే పిల్లలు అనారోగ్య హేతువుకు గురి కావడంతో పాటు భర్త ఆయుష్షను తగ్గించిన వాళ్లు అవుతారని నిపుణులు హెచర్చిస్తున్నారు. ఇలా ప్రతి నెలసరి సమయంలో స్త్రీలు శుచి, శుభ్రతలు పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సుచిస్తున్నారు.