జమ్మలమడుగుకు చెందిన వైష్ణవికి గత రెండేళ్ల కిందట వివాహం జరిగింది. పెళ్లైన నాటి నుంచి ఈ దంపతులు సంతోషంగానే కలిసి ఉన్నారు. అయితే ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ, ఆ మహిళ ఉన్నట్టుండి సంచలన నిర్ణయం తీసుకుంది. అసలేం జరిగిందంటే?
ఈ మధ్యకాలంలో వరుస ఆత్మహత్యలు ప్రజలను భయందోళనలకు గురి చేస్తున్నాయి. తల్లిదండ్రులు మందలించారని, ప్రియుడు మోసం చేశాడని ఇలా అనేక రకాల కారణాలతో ఆత్మహత్యలు చేసుకుని కన్నవాళ్లకు కడుపుకోత మిగిల్చి వెళ్లిపోతున్నారు. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ మహిళ నాలుగు నెలల కూతురిని చూడకుండా ఊహించని నిర్ణయం తీసుకుంది. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. అసలేం జరిగిందంటే?
పోలీసుల వివరాల ప్రకారం.. వైఎస్సాఆర్ కడప జిల్లా జమ్మలమడుగులో కంచెం వైష్ణవి (21), గుత్తి రవి కుమార్ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి రెండేళ్ల కిందటే వివాహం జరిగింది. భర్త సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. పెళ్లైన నాటి నుంచి ఈ దంపతుల దాంపత్య జీవితం సాఫీగానే సాగుతూ వచ్చింది. అయితే గత నాలుగు నెలల కిందట ఈ భార్యాభర్తలకు ఓ కూతురు కూడా జన్మించింది. దీంతో ఈ దంపతులు కూడా ఎంతో సంతోషించారు.
అయితే ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ, ఉన్నట్టుండి వైష్ణవి సంచలన నిర్ణయం తీసుకుంది. నాలుగు నెలల కూతురిని చూడకుండా.. ఈ వివాహిత తాజాగా ఆత్మహత్మకు పాల్పడి ప్రాణాలు తీసుకుంది. ఈ విషయం తెలుసుకున్న వివాహిత తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతరం మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.