ఖమ్మం జిల్లాలోని ఓ యువకుడు చితిపై కూర్చుని నిరసన వ్యక్తం చేశాడు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లాలోని వేంసూరు ప్రాంతంలో ఇటీవల ఓ వ్యక్తి మరణించాడు. దీంతో దహన సంస్కరాలు చేసేందుకు బంధువులంతా సిద్దమయ్యారు. చితిని కూడా ఏర్పాటు చేశారు. కానీ ఇంతలోనే కొంతమంది యువకులు వచ్చి దహనసంస్కరాలు ఇక్కడ జరపొద్దు అంటూ నిరసన తెలియజేశారు.
ఇక ఎంతకూ కూడా మృతుడి బంధువుల వినకపోవంటంతో ఓ యువకుడు ఏకంగా చితిపై కూర్చుని డిమాండ్ చేశారు. ఇక విషయం ఏంటంటే..? స్థానికంగా ఇళ్ల మధ్య దహన సంస్కరాలు చేస్తుండటంతో కాలనీ వాళ్లు ఇబ్బందులు ఎదుర్కుంటున్నామని, ఇక్కడ చేయొద్దని ఆరోపించారు. ఇక గ్రామ పెద్దలు జోక్యం చేసుకుని చివరిసారిగా చేస్తామని మళ్లీ ఇక్కడ ఎవరూ కూడా చేయరని అనటంతో అక్కడికి ఆ వివాదం సద్దుమణిగింది. కానీ ఆ యువకుడు ఏకంగా చితిపై కూర్చుని నిరసన తెలియటంతో స్థానికంగా కలకం రేగింది.
