ఫేస్ బుక్ ద్వారా పరిచయం అయ్యి స్నేహించుకుని, ఆ తర్వాత ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న జంటలు చాలానే ఉన్నాయి. అయితే ఇదే ఫేస్ బుక్ ని ఉపయోగించుకుని కొంతమంది మోసాలకు పాల్పడుతున్నారు. ఫేస్ బుక్ అనే కాదు, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా యాప్ లని వాడుకుని అనేక దారుణాలకు ఒడిగడుతున్నారు. తాజాగా ఓ వ్యక్తి.. ఒక మహిళను ఫేస్ బుక్ ద్వారా పరిచయం చేసుకుని.. పెళ్లి చేసుకుంటానని చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఫేస్ బుక్, ఫేస్ బుక్ నువ్వేం చేస్తావంటే.. అపరిచితులిద్దరినీ ఒకటి చేస్తా. ఆ తర్వాత వారి జీవితాలను చిత్తు చేస్తా అన్నదట. ప్రస్తుతం జరుగుతున్న దారుణాలు చూస్తుంటే అలానే ఉంది మరి. ఫేస్ బుక్ లో అమ్మాయిల పేర్లు సెర్చ్ చేయడం.. బాగుంటే రిక్వస్ట్ పెట్టడం, చాటింగ్ చేయడం, ఆ తర్వాత ప్రేమ పేరుతో మోసం చేయడం. ఇదే ట్రెండ్ నడుస్తోంది. అమ్మాయిలు కూడా ఇలాంటి వాళ్ళని నమ్మి మోసపోతున్నారు. ఫేస్ బుక్ ద్వారా పరిచయమయ్యాడు. తాజాగా ఓ యువతి కూడా ఫేస్ బుక్ మాయలోడి ట్రాప్ లో పడి మోసపోయింది. ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి దగ్గరయ్యాడు. పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చేసరికి నువ్వెవరో నాకు తెలియదంటూ ముఖం చాటేశాడు.
గుంటూరు తాడేపల్లి మండలానికి చెందిన యువతి (22) విజయవాడ బీసెంట్ రోడ్డులో ఉన్న ఓ బట్టల దుకాణంలో కొన్నాళ్ళు పని చేసింది. ఆ సమయంలో ఎం. రమేష్ బాబు అనే యువకుడు ఫేస్ బుక్ ద్వారా పరిచయమయ్యాడు. ప్రేమించానంటూ యువతి వెంట తిరిగాడు. అయితే యువతి పట్టించుకోలేదు. వేరే యువకుడ్ని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత అతనితో విడిపోయి ఒంటరిగా ఉంటుంది. సూర్యారావుపేటలోని ఆసుపత్రిలో పని చేస్తుంది. ఈ క్రమంలో రమేష్ బాబు మళ్ళీ ఆమె జీవితంలోకి వచ్చాడు. ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఆమె నమ్మడంతో గత నెల 14న గుంటూరు వెళ్లారు.
యువతిని గుంటూరు బస్టాండ్ సమీపంలో తనకు తెలిసిన వారి ఇంటికి తీసుకెళ్లాడు. దంపతులమని చెప్పి రెండు రోజులు ఆ ఇంట్లోనే ఉన్నారు. అలా వీరిద్దరూ పలుమార్లు శారీరకంగా దగ్గరయ్యారు. రెండు రోజుల తర్వాత మోజు తీరడంతో రమేష్ బాబు.. ఆ యువతిని విజయవాడలో వదిలేశాడు. జనవరి 16 తర్వాత మళ్ళీ బాబు టచ్ లో లేడు. పెళ్లి చేసుకునేందుకు నిరాకరించడంతో మోసపోయానని గ్రహించింది ఆ యువతి. దీంతో రమేష్ బాబు మీద ఆమె సూర్యారావుపేట పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిందితుడిపై అత్యాచారం, మోసం సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేయండి.