ఈ మధ్యకాలంలో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. ఒంటరిగా ఉన్న మహిళలపై దాడి చేసి.. వారి వద్ద ఉన్న బంగారాన్ని దోచుకుని పారిపోతున్నారు. ప్రతిఘటించిన మహిళలను చంపడానికి కూడా వెనుకాడటం లేదు. పోలీసులు ఎప్పటికప్పుపడు కఠినమైన చర్యలు తీసుకుంటున్న.. వీరి దోపిడి మాత్రం ఆగడం లేదు. తాజాగా ఓ మహిళ.. తన ఇంటి ముందు ముగ్గు వేస్తుండగా దొంగ ఆమెపై దాడి చేశాడు. ఆమె నుంచి బంగారపు చైన్ చోరి చేశాడు. ఈ ఘటన కర్నాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
కర్నాటక రాష్ట్రంలోని హసన్ జిల్లాలో హోలేనర్ సీపుర్ అనే పట్టణానికి చెందిన సరస్వతి అనే మహిళ ఉదయాన్నే తన ఇంటి ముందు ముగ్గు వేస్తుంది. ఇదే సమయంలో ఓ దొంగ.. ముగ్గు వేస్తున్న సరస్వతి సమీపంలో తిరుగుతూ కొద్ది సమయం గడిపాడు. సరస్వతి ముగ్గు వేయడంలో నిమగ్నమైన సమయంలో ఆ దొంగ ఒక్కసారిగా ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును తెంపేందుకు ప్రయత్నించాడు. వెంటనే బాధితురాలు గట్టిగా కేకలు వేసింది. దీంతో ఆ దొంగ.. ఆమె నోరు గట్టిగా మూసేసి గొలుసు తెంపుకుని పారిపోయాడు.ఈ క్రమంలో ఆమె ముఖంపై ముగ్గు పడి చాలా ఇబ్బందికి గురైంది.
అయితే ఆ దొంగ.. తన ఆచూకీ తెలియకుండా ఉండేందుకు తెలివిగా హెల్మెట్ పెట్టుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలంకి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. స్థానికంగా ఉన్న సీసీటీవీలో ఘటనా దృశ్యాలు రికార్డు అయ్యాయి. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: బర్త్ డే రోజే డెత్ నోట్ రాసి.. ఉపాధ్యాయురాలు ఆత్మహత్య!
ఇదీ చదవండి: ఇంటికి వెళ్లేందుకు ఏకంగా ఆర్టీసీ బస్సునే చోరీ చేసిన ఘనుడు!