Bride Srujana: విశాఖ వధువు సృజన మరణం ఓ మలుపు తిరిగిన సంగతి తెలిసిందే. అందరూ భావిస్తున్నట్లుగా సృజన మృతికి గుండెపోటు కారణం కాదని తేలింది. పోస్టుమార్టం రిపోర్టులో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. వధువు శరీరంలో విషపదార్థాలు ఉన్నట్లు పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. డాక్టర్లు ఆమె మృతికి ఆత్మహత్య కారణంగా భావిస్తున్నారు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సృజన సన్నిహితులను పోలీసులు విచారించినట్లు సమాచారం. ఈ పెళ్లి సృజనకు ఇష్టం లేదని వారు పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. పోలీసులు ఈ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, విశాఖపట్టణానికి చెందిన నాగోతి అప్పలారాజు, లలితల కుమారుడు శివాజికి అదే ప్రాంతానికి చెందిన ముంజేటి ఈశ్వర్ రావ్, ముంజేటి అనురాధల కుమార్తె సృజనకు కొద్దిరోజుల క్రితం పెళ్లి కుదిరింది. మధురవాడ, కాలానగర్‌లోని ద్రోణమ్‌రాజు కల్యాణ మండపంలో బుధవారం రాత్రి 7 గంటలకు పెళ్లి ముహుర్తం. పండితుల వేద మంత్రాల మధ్య జీలకర్ర బెల్లం పెట్టే ప్రక్రియ మొదలయింది. సరిగ్గా ఆ సమయంలో ఊహించని విధంగా సృజన పెళ్లి పీటలపై కుప్పకూలింది. కుటుంబ సభ్యులు కంగారుపడి ఆమెకు సపర్యలు చేశారు. ఎంతకీ పైకి లేవకపోవటంతో ఆసుపత్రికి తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు, అప్పటికే ప్రాణం కోల్పోయినట్టు నిర్ధారించారు. మరి, సృజన మృతికి ఇష్టంలేని పెళ్లి కారణమా? అన్న కోణంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Bride Srujana: విశాఖ పెళ్లికూతురు మృతి! వైరల్ గా మారిన ప్రీ వెడ్డింగ్ షూట్ వీడియో!