కొందరు రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు తమ స్టేటస్‌ను అడ్డం పెట్టుకుని.. పలు నేరాలకు పాల్పడతారు. మరీ ముఖ్యంగా మహిళలపై లైంగిక నేరాలకు ఒడిగడతారు. వీరి అండ చూసుకుని.. వారి కుటుంబ సభ్యులు కూడా ఇదే విధమైన నేరాలకు పాల్పడుతుంటారు. రాజకీయ నాయకులు తమ పలుకుబడిని, అధికారాన్ని అడ్డంపెట్టుకుని మహిళలను వేధిస్తుంటారు. తమ కోరికలను తీర్చాలని అవతలివారిని బెదిరిస్తుంటారు. కొన్ని చోట్ల మహిళలు ఈ వేధింపులకు భయపడి.. రాజకీయ నాయకులకు లొంగిపోతున్నారు. మరికొన్ని చోట్ల.. మహిళలు తిరగబడి వీరి బండారం బయటపెడుతున్నారు. ఇలాంటి ఘటన ఒకటి తాజాగా వెలుగులోనికి వచ్చింది. కేరళలో ఈ దారుణం చోటు చేసుకుంది.
కేరళ మాజీ ఎమ్మెల్యే పీసీ జార్జ్ తనను లైంగికంగా వేధించాడని ఒక మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిబ్రవరి 10 న జార్జ్ తనను థైకాడ్ లోని, గెస్ట్ హోస్ కు పిలిచి అత్యాచారం చేశాడని తెలిపింది. ఆ తర్వాత.. తరచుగా బెదిరించే వాడని, అశ్లీల మెసెజ్‌లు పంపి బెదిరింపులకు గురిచేసేవాడని తెలిపింది. ఈ క్రమంలో దీంతో విసిగి పోయిన సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుడిపై పొక్సో, నిర్భయ చట్టం కింద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ ఘటన కేరళ నాట తీవ్ర దుమారంగా మారింది. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.