video call : విధి వక్రించటం అంటే ఇదేనేమో.. కోపంగా ఉన్న ప్రియురాలిని శాంతింప చేయటానికి ఓ యువకుడు చేసిన ప్రయత్నం అతడి ప్రాణాలు తీసింది. వీడియో కాల్ లైవ్‌లోనే ప్రాణాలు పొగోట్టుకున్నాడు. ఈ సంఘటన బిహార్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బిహార్, అతమల్ గోల పోలీస్ స్టేషన్ పరిథిలోని రూపాస్ గ్రామానికి చెందిన యువకుడు బుధవారం రాత్రి భోజనం తర్వాత తన గదిలోకి వెళ్లాడు. ఫోన్లో ప్రియురాలితో వీడియో కాల్ మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాటలు కొద్దిసేపటి తర్వాత వాదనకు దారి తీశాయి.
దీంతో ప్రియురాలు కోపానికి గురైంది. అతడిపై అలిగింది. కోపంగా ఉన్న ప్రేయసిని కూల్ చేయటానికి అతడు చాలా ప్రయత్నాలు చేసి విసిగిపోయాడు. ఆ తర్వాత ఉరివేసుకుని ఛస్తా అంటూ బెదిరింపులకు దిగాడు. అది కూడా ఆమెను భయపెట్టడానికి. లైవ్‌లోనే ఫ్యాన్‌కు ఉరి బిగించాడు. టేబుల్ మీదకు ఎక్కి ఉరి తాడును మెడకు బిగించుకున్నాడు. ఈ టైంలో అతడి ఫోన్ చేతిలోంచి జారి కిందపడింది. అతడు దాన్ని పట్టుకోవటానికి పక్కకు కదిలాడు. అంతే! అదుపు తప్పి టేబుల్ మీదనుంచి కిందకు పడి, ఉరి గొంతుకు బిగుసుకుంది.
వీడియో లైవ్‌లో ఉండగానే ఉరికి వేళాడుతూ ఉన్నాడు. ప్రియుడికి ఉరి బిగించుకోవటంతో ప్రియురాలు దిగ్బ్రాంతికి గురైంది. అతడి ఇంటి పక్క వారికి ఫోన్ చేసి విషయం చెప్పింది. వాళ్లు అతడి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వాళ్లు గది కిటికీ తలుపు తెరిచి చూడగా.. లోపల అతడు ఉరికి వేలాడుతూ ఉన్నాడు. తలుపు బద్దలు కొట్టి అతడ్ని కిందకు దించారు. అతడు అప్పటికే ప్రాణాలు విడిచాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : కామాంధుడు.. కూతుర్ని కూడా వదల్లేదు.. సవతి తల్లి పుణ్యమా అని..
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.