విశాఖ బీచ్ లో శ్వేత అనే మహిళా అనుమానాస్ప స్థితిలో మరణించిన విషయం తెలిసిందే. ఇదే ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారుతోంది. ఈ ఘటనపై తాజాగా మృతురాలి భర్త మణికంఠ మీడియాతో మాట్లాడాడు. అతడు ఏమన్నాడంటే?
విశాఖ బీచ్ లో శ్వేత అనే గర్భిణి మహిళా అనుమానాస్పద రీతిలో నగ్నంగా మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అయితే మంగళవారం నుంచి కనిపించకుండా పోయిన శ్వేత.. ఉన్నట్టుండి బీచ్ లో శవమై కనిపించడంతో మృతురాలి తల్లి, కటుంబ సభ్యులు గుండెలు పగిలేలా ఏడ్చారు. ఇదిలా ఉంటే మృతురాలు శ్వేత ఇంట్లో సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తుంది. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు.
అసలేం జరిగిందంటే?
విశాఖలోని గాజువాకలో శ్వేత-మణికంఠ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి గతేడాది పెద్దల సమక్షంలో ఘనంగా వివాహం జరిగింది. భర్త సాఫ్ట్ వేర్ ఉద్యోగి. అలా పెళ్లైన కొంత కాలం పాటు ఈ దంపతులు సంతోషంగానే ఉన్నారు. అయితే గత కొన్ని నెలల నుంచి ఈ దంపతుల మధ్య కలహాలు మొదలైనట్లుగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే భార్య శ్వేత భర్తపై అలిగి రెండు సార్లు పుట్టింటికి వెళ్లినట్లుగా సమాచారం. దీంతో శ్వేత తల్లి నచ్చచెప్పి మళ్లీ అత్తింటికి పంపింది. ఇక కొన్నాళ్ల తర్వాత శ్వేత గర్భం దాల్చింది. ఇదిలా ఉంటే భర్త మణికంఠ ఉద్యోగం నిమిత్తం ఇటీవల హైదరాబాద్ కు వెళ్లాడు. కొన్నాళ్ల నుంచి అతడు అక్కడే ఉండగా, భార్య శ్వేత అత్తింట్లోనే ఉండేది.
అయితే గత కొన్ని రోజుల నుంచి భార్యాభర్తలు ఫోన్ లో మళ్లీ గొడవ పడినట్లుగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే మంగళవారం శ్వేత ఇంట్లో ఫోన్ ఉంచి కనిపించకుండాపోయింది. అత్తమామలు ఇంట్లో చూడగా శ్వేత కనిపించలేదు. వారికి ఏం చేయాలో తెలియక వెంటనే స్థానిక పోలీసులు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలించారు. ఈ క్రమంలోనే విశాఖ బీచ్ లో శ్వేత నగ్నంగా శవమై తేలింది. ఈ సీన్ చూసిన కొందరు స్థానికుులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కనిపించకుండా పోయిన వివాహిత శ్వేతగా గుర్తించారు. వెంటనే ఆమె తల్లితో పాటు అత్తమామలకు సమాచారం అందించారు. ఈ విషయం తెలుసుకున్న మృతురాలి తల్లి, అత్తమామలు కన్నీరు మున్నీరుగా విలపించారు. అయితే భార్య మరణించిన వార్త తెలుసుకున్న భర్త మణికంఠ హైదరాబాద్ నుంచి విశాఖకు బయలు వచ్చాడు.
భర్త చెప్పిన నిజాలు:
భార్య మిస్సింగ్, మరణంపై మృతురాలి భర్త మణికంఠ తాజాగా మీడియాతో మాట్లాడతూ.. నా భార్యను నేను వేధించలేదు. గత కొన్ని రోజుల నుంచి మా ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు జరిగాయి. ఎన్నో సార్లు తనకు నచ్చజెప్పే ప్రయత్నం చేశాను. గతంలో గొడవల కారణంగా రెండు సార్లు నాపై కోపంతో పుట్టింటికి వెళ్లింది. ఇక కొన్ని రోజుల తర్వాత మళ్లీ తిరిగి ఇంటికి వచ్చింది. నా భార్య సివిల్స్ కు ప్రిపేర్ అయ్యేది, నేను కూడా పూర్తిగా ఆమెకు సహకరించాను. నేను ఉద్యోగం నిమిత్తం ఈ మధ్యే హైదరాబాద్ కు వెళ్లాను, తొందర్లోనే ఇద్దరం కలిసి ఒకే ఇంట్లో ఉందామని కూడా చెప్పానంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. రెండు రోజుల నుంచి కూడా మేము ఇద్దరం ఫోన్ లో మాట్లాడుకున్నాం. కానీ, సడెన్ గా.. నాకు ఎప్పుడో తెలుసు, నేను లేకుండా నువ్వు ఉండగలవని. నీకు అసలు ఏం మాత్రం ఫరఖ్ పడదు అని. ఏనీ వే ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అండ్ న్యూ లైఫ్.. అంటూ సూసైడ్ నోట్ రాసిందని ఇలా చేసింది. ప్రస్తుతం నా భార్య 5 నెలల గర్భవతి. కనీసం కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసం కూడా ఆలోచించలేదని తెలిపాడు.