వయసుతో సంబంధం లేకుండా యువకుడితో ఓ పెద్దాయన పెట్టుకున్న స్నేహం అతని జీవితాన్నే మార్చేసింది. మంచితనం కొద్దీ భోజనం చేసి వెళ్దువుగానీ అని అడగడమే అతను చేసిన తప్పైంది. అలా వచ్చిన ఓ నీఛుడు అన్నం పెట్టిన వ్యక్తి భార్యపై కన్నేశాడు. వలపు వలలు విసిరి ముగ్గులోకి దించాడు. ఆంటీని దక్కించుకుని వేరు కాపురం పెట్టేశాడు. అడ్డొస్తున్నాడని ఆదరించిన ఆ పెద్దాయన్నే హతమార్చాడు. అడ్రస్ మార్చేసి దర్జాగా బతుకుతున్నాడు. కానీ, చేసిన పాపం ఎక్కడికి పోతుంది. తిరిగి 9 నెలల తర్వాత ఇప్పుడు ఊచలు లెక్కపెడుతున్నాడు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
ఆరిలోవ సీఐ ఇమ్మాన్యుయేల్ తెలిపిన వివరాల ప్రకారం.. ముత్యు శ్రీనివాసరావు(43) ఓ ఫర్నీచర్ దుకాణానికి వాచ్‌మన్ గా చేసేవాడు. భార్య, ఇద్దరి పిల్లతో కలిసి ఎండాడలో నివాసముండేవాడు. శ్రీనివాసరావుకు కల్లు తాగే అలవాటు ఉంది. 2019లో అలా కల్లు తాగుతుండగా చాకలిపేటకు చెందిన లక్ష్మణ్(26) పరిచయమయ్యాడు. వాళ్లిద్దరూ కల్లు పాక ఫ్రెండ్స్ అయ్యారు. తరచూ కలిసి కల్లు తాగుతుండేవారు. ఓ రోజు రిషికొండ సమీపంలో కల్లు తాగిన తర్వాత భోజనం చేసేందుకు లక్ష్మణ్ ను ఆహ్వానించాడు. పిలవడమే తడవుగా శ్రీనివాసరావు ఇంటికి భోజనానికి వెళ్లాడు. ఆ తర్వాత తరచూ శ్రీనివాసరావు ఇంటికి వెళ్లడం ప్రారంభించాడు.
అలా వెళ్లే క్రమంలో ఇంకిత జ్ఞానం, నైతిక విలువలు, వయసు అనే మాటలను పట్టించుకోకుండా శ్రీనివాసరావు భార్యతో సంబంధం పెట్టుకున్నాడు. వీడి బుద్ధి గడ్డి తినింది సరే.. ఆ వయసులో మహిళ జ్ఞానం ఏ గాడిదలు కాయడానికి వెళ్లిందో తెలియదు. ఆమె కూడా లక్ష్మణ్ తో వివాహేతర సంబంధానికి తెర లేపింది. వయసు మరిచి లక్ష్మణ్ తో పడక సుఖాన్ని అనుభవిచింది. విషయం తెలిసిన భర్త లక్ష్మణ్, భార్యను మందలించాడు. అలా చేయడం తప్పంటూ వారించాడు. భర్త చర్యతో చిర్రెత్తుకొచ్చి ఇద్దరూ జెండా పీకేశారు. నగరంలోని రైల్వే న్యూ కాలనీలో కాపురం పెట్టేశారు.
ఇదీ చదవండి: విదేశాల్లో భర్త.. ప్రియుడి మోజులో భార్య! రోజు నగ్నంగా
విషయం తెలుసుకున్న శ్రీనివాసరావు 2021 ఏప్రిల్ 11న రైల్వే న్యూ కాలనీకి వెళ్లాడు. లక్ష్మణ్, భార్యను కలిసి.. మద్యం మత్తులో పెద్ద గొడవ చేశాడు. మంచి మాటలు చెప్పి లక్ష్మణ్.. శ్రీనివాసరావును బైక్ ఎక్కించుకుని తీసుకెళ్లాడు. గుడ్లవానిపాలెం వద్దనున్న అమ్మవారి ఆలయం వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ పక్కనే ఉన్న బీచ్ కు రామని పిలిచాడు. అక్కడికి వెళ్లాక.. పక్కనే ఉన్న ఇటుక తీసుకుని శ్రీనివాసరావుపై దాడికి దిగాడు. కిరాతకంగా తలపై కొట్టాడు. కొన ఊపిరితో ఉన్న శ్రీనివాసరావును అక్కడే వదిలేసి పరారయ్యాడు. అక్కడున్న స్థానికులు కొందరు చూసి 108లో ఆస్పత్రికి చేర్చారు. దారిలోనే శ్రీనివాసరావు ప్రాణాలు పోయాయి. ఒంటిపై దెబ్బలు చూసి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.
లక్ష్మణ్- శ్రీనివాసరావు భార్య ఇద్దరూ మకాం విజయవాడకు మార్చారు. విచారణలో చనిపోయిన వ్యక్తి ఎండాడ నివాసి శ్రీనివాసరావని తెలుసుకున్నారు. దర్యాప్తులో అతని భార్య పెట్టుకున్న వివాహేతర సంబంధం గురించి పసిగట్టారు. వారు ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఉండటం లేదని ఎప్పటికైనా వస్తారని ఎదురు చూశారు. దాదాపు 9 నెలలు గడిచాయి.. ఎలాంటి కేసు కూడా ఉండదని భావించాడు. రైల్వేకాలనీలో ఇంట్లోని సామాను కోసం వెళ్లాడు. ఎప్పుడెప్పుడు వస్తారా అని కాపు కాసిన పోలీసులు ఎట్టకేలకు వీరిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో శ్రీనివాసరావును హత్యచేసిన విషయాన్ని ఒప్పుకున్నాడు. దీంతో అనుమానాస్పద మృతి కేసును హత్య కేసుగా మార్చి.. లక్ష్మణ్ ను రిమాండుకు తరలించారు. లక్ష్మణ్ కు గతంలో వివాహం జరిగిందని.. భార్యకు దూరంగా ఉంటున్నట్లు సీఐ ఇమ్మాన్యుయేల్ తెలిపారు.
ఐదు నిమిషాల సుఖం కోసం ఆ యువకుడు- ఆ మహిళ తమ జీవితాలను ఛిన్నాభిన్నం చేసుకున్నారు. క్షణికావేశంలో శ్రీనివాసరావును హత్యచేసి చిన్న వయసులోనే హంతకుడిగా మారి జీవితాన్ని కోల్పోయాడు. వయసు మర్చిపోయి స్నేహం చేసి చేరదీసిన వ్యక్తిని మోసం చేసి దుర్గార్గుడిగా మారాడు. అసలు మొత్తం ఘటనలో తప్పు ఎవరిది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.