నవమాసాలు మోసి, అల్లారు ముద్దుగా పెంచిన తల్లిని ఓ కుమార్తె పొట్టన పెట్టుకుంది. పెనంతో అత్యంత దారుణంగా తల్లిని కొట్టి చంపింది. ఈ దారుణం ఉత్తరప్రదేశ్ లోని నొయిడాలో జరిగింది. శాహదరా ప్రాంతానికి చెందిన అనురాధకు ఇద్దపు పిల్లలు ఉన్నారు. గ్రేటర్ నొయిడాలోని ఓ సంస్థలో అనురాధ పనిచేస్తోంది. ఆమె ఐదేళ్ల క్రితం తన భర్త నుంచి విడిపోయి పిల్లలతో ఉంటోంది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
ఆదివారం తల్లీకూతుళ్ల మద్య వాగ్వాదం జరిగింది. ఇంట్లో పనులు చయడం లేదని కుమార్తెపై తల్లి కోప్పడింది. ఇంట్లో గిన్నెలు తోమమని చెప్పినా వినలేదని మందలించింది. తిట్టి, ఆమెపై తల్లి చేయిచేసుకుందని కుమార్తె కోపంతో రగిలిపోయింది. పెనం(pan) తీసుకుని గట్టిగా కొట్టింది. అనురాధ స్పృహ కోల్పోయి కిందపడిపోయింది. ఆ తర్వాత కుమార్తె తన తల్లి పడిపోయిందంటూ వెళ్లి చుట్టుపక్కల వారికి చెప్పింది. విషయం తెలుసుకున్న వాళ్లు ఆమె హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
కానీ, అనురాధ ఆస్పత్రికి చేరుకునేలోపే మరణించింది. అసలు విషయం తెలుసుకున్న పొరుగువారు కుమార్తె తల్లిని కొట్టి చంపిందని పోలీసులకు తెలిపారు. ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేశారు. తల్లిని అక్కే కొట్టిందని ఆమె తమ్ముడు ఫిర్యాదు చేయడంతో బాలికను అదుపులోకి తీసుకున్నారు. ఆమెను బాల నేరస్థుల కేంద్రానికి తరలిస్తామని తెలిపారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: ఇంట్లోంచి లాక్కొచ్చి ప్రేమికులపై తూటాల వర్షం!