నేటి సమాజం ఎటు వెళ్తుందో అర్థం కాని పరిస్థితి. చిన్నపిల్లలపై అత్యాచారాలు, హత్యలకు సంబంధించిన వార్తలు మనం నిత్యం వింటున్నాం. ఇలాంటి విన్నప్పుడు.. పిల్లలు మనషుల మధ్య తిరుగుతున్నారా? లేదా మృగాల మధ్య ఉన్నారా? అనే భావన కలుగక మానదు. పిల్లలపై అత్యాచార, హత్యా ఘటనలు దేశంలో రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. పసి పిల్లల్లో కూడా కామం చూసే మృగాలు నేటి సమాజం తిరుగుతున్నాయి.
గతంలో సైదాబాద్ లోని సింగరేణి కాలనీలో గుడెసెలో నివసించే ఆరేళ్ల చిన్నారిపై రాజు అనే యువకుడు అత్యాచారం చేసి, దారుణంగా హత్యచేశాడు. అప్పట్లో ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. వాడిని ఊరితీయాలని ప్రతి ఒక్కరు కోరుకున్నారు. చివరికి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఇప్పుడు యూపీలోనూ సింగరేణి కాలనీ తరహాలోని ఓ దారుణ సంఘటన జరిగింది.
ఉత్తరప్రదేశ్ లోని హపూర్ ప్రాంతానికి చెందిన ఆరేళ్ల చిన్నారి, గురువారం సాయంత్రం చాకెట్లు కొనుక్కుంటానని బయటకి వెళ్లింది. ఆ తరువాత ఎంత సేపటికి తను ఇంటికి రాలేదు. చిన్నారి తల్లిదండ్రులు పరిసర ప్రాంతాల్లో ఎంత వెతికిన కనిపించలేదు. దీంతో పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. అనంతరం కూడా బంధువుల ఇళ్లలో కనుక్కున్నారు. ఎంత ప్రయత్నించిన పాప ఆచూకీ లభించలేదు. ఈ సమయంలో అదే ప్రాంతంలోని ఓ ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
అక్కడి వచ్చిన పోలీసులు ఇంటి తలుపు తాళం పగులగొట్టి లోపలికి వెళ్లారు. అక్కడ ఓ ట్రంకు పెట్టే నుంచి దుర్వాసన రావటం పోలీసుల గమనించారు. ఆ ట్రంకు పెట్టేను తెరచి పోలీసులు షాక్ గురయ్యారు. బట్టలు లేని స్థితిలో బాలిక మృతదేహం ఆ ట్రంకు పెట్టె ఉంది. పోలీసులు ఆ ఇంటి యజమాని అదుపులోకి తీసుకోని విచారించారు. నిందితుడు ఆ ఇంటి యజమానే అని స్థానికులు భావించారు. దీంతో స్థానికులు నిందితుడిని పట్టుకుని దేహ శుద్ధి చేశారు.
స్థానికంగా ఉన్న సీసీ ఫుటేజిని పరిశీలించిన పోలీసులకు ఘటనకు సంబంధించి కొన్ని దృశ్యలు కనిపించాయి. ఆ ఇంటి యాజమానే చిన్నారి బైక్ పై కూర్చుపెట్టుకోని తన ఇంటికి తీసుకెళ్లిన దృశ్యాలు సీసీ ఫుటేజిలో రికార్డు అయ్యాయి. దీంతో అతడే ఈ అత్యాచారం చేసి హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. బాలిక మృతదేహాన్ని శవ పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. రిపోర్టు వచ్చాక.. పూర్తి విషయాలు తెలుస్తాయని పోలీసులు తెపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనతో నిందితుడిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడి తమకు వదిలేస్తే ప్రజాకోర్టులోనే శిక్షిస్తామని స్థానికులు అంటున్నారు. నిత్యం ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. నిందితులకు మరణశిక్షలు సైతం పడుతున్నా.. అయిన ఈ తరహా ఘటనలు పెరుగుతున్నాయే కానీ ఆగటం లేదని కొందరు అభిప్రాయ పడుతున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.