నీకు ఏ కష్టం రానివ్వను అంటూ మాటిచ్చి మనువాడిన భర్తే.. కాల యముడు అయ్యాడు. కట్టుకున్న భార్యను కర్కశంగా హత్య చేశాడు. పండగ రోజు భార్యాభర్తల మధ్య గొడవ రాజుకుంది. ఉపవాసం దీక్ష పేరుతో మొదలైన వివాదం ముదిరిపోయింది. ఇద్దరూ మాటామాటా అనుకున్నారు. ఆ తర్వాత దిండుతో వత్తి భార్యను హత్య చేశాడు. ఆ తర్వాత నేరుగా పోలీసుస్టేషన్ వెళ్లి లొంగిపోయాడు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
వివరాల్లోకి వెళ్తే.. శ్రీకాకుళం జిల్లా సానివాడ గ్రామంలో పొన్నాడ నవీన్ కుమార్- కల్యాణి దంపతులు జీవిస్తున్నారు. నవీన్ కుమార్ కు అన్నదమ్ములు, అక్క ఉన్నారు. నవీన్ చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారు. అప్పటి నుంచి కుటుంబ భారాన్ని నవీన్ తీసుకున్నాడు. సవంత్సరం క్రితమే రోడ్డు ప్రమాదంలో తమ్ముడు చనిపోయాడు. అక్కకు గతేడాది వైభవంగా వివాహం చేశాడు. ఆమె గర్భవతి కావడంతో.. ఏడో నెలన తమ్ముడి ఇంటికి వచ్చింది. అయితే తరచూ ఆడపడుచుల మధ్య గొడవలు జరిగేవని స్థానికులు తెలిపారు.
మంగళవారం కూడా వారి మధ్య గొడవ జరిగింది. రాత్రి 8 గంటల నుంచి వారు తిట్టుకుంటూనే ఉన్నారు. నవీన్ అక్క శివరాత్రి కావడంతో కల్యాణిని ఉపవాసం ఉండాలని చెప్పింది. అందుకు నా వల్ల కాదంటూ కల్యాణి తెగేసి చెప్పేసింది. ఆ విషయంలో వారి మధ్య పెద్ద గొడవ జరిగింది. ఆ తర్వాత నవీన్ వారిద్దరికీ సర్ది చెప్పాడు. కానీ, ఆ విషయంలో భార్యభర్తల మధ్య గొడవ మొదలైంది. ఆ సమయంలో క్షణికావేశంలో నవీన్ భార్య కల్యాణి ముఖంపై దిండుతో ఒత్తి హత్య చేశాడు. ఆ తర్వాత శ్రీకాకుళం రూరల్ పోలీసుస్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. అక్కపై ఉన్న ప్రేమతోనే భార్యను హత్య చేసి ఉంటాడని స్థానికులు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లైవ్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.