సమాజంలో మహిళలకు రోజు రోజుకు లైంగిక వేధింపులకు ఎక్కువవుతున్నాయి. మూడేళ్ల పసి పిల్లల నుంచి 90 ఏళ్ల ముసలవ్వల వరకు ఎవ్వరినీ కూడా వదలకుండా కామంతో బరితెగించి ప్రవర్తిస్తూ అడ్డుగోలు అరాచకాలను శ్రీకారం చుడుతున్నారు. ఇక కొందరు పెళ్లైన వివహితలపై కన్నేస్తూ ఒప్పుకునేదాక వెంటపడతారు. కాదంటే హత్యలకు కూడా వెనకాడని పరిస్థితులు దాపరిస్తున్నాయి. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ వివాహితపై కామాంధుడు కాటేయబోయి ఏకంగా భర్తపైనే దాడి చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు.
ఇటీవల ప్రకాశం జిల్లాలో జరిగిని ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ప్రకాశం జిల్లా కనిగిరి మండలంలోని ఓ గ్రామానికి చెందిన వివాహితను అదే ప్రాంతానికి చెందిన ఏడుకొండలు అనే వ్యక్తి వేధిస్తున్నాడు. అంతటితో ఆగక సదరు మహిళ భర్తకే ఫోన్ చేసి నీ భార్యను పంపాలని, లేకుంటే చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. అతడి వేధింపులు తట్టుకోలేక ఆమె కనిగిరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతని మీద పోలీసుల వైపు నుంచి ఎటువంటి చర్యలు లేవంటూ.. ఇటీవల జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించే ‘స్పందన’ కార్యక్రమంలో మరోమారు ఫిర్యాదు చేసింది.
మీరు ఈ క్రైమ్ వార్తలు చదివారా?
అనంతరం కనిగిరి బస్టాండ్ నుంచి తన తల్లితో కలిసి నడిచి వస్తున్న ఆమెను అడ్డుకున్నాడు. నాపైనే కేసు పెడతారా అంటూ… రక్తమొచ్చేలా వారిద్దరినీ కొట్టాడు. నీ భర్తను చంపేస్తానంటూ బెదిరించాడు. ఆసుపత్రిలో చికిత్స పొందిన తర్వాత ఆమె మళ్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయినా అతనిపై పోలీసులు ఏం చర్యలు తీసుకోలేదని మహిళ ఆరోపిస్తోంది. అతనికి రాజకీయ నాయకుల అండ ఉండబట్టే పోలీసులు చర్యలు తీసుకోవట్లేదని విమర్శిస్తోంది. నిందితుడిని వెంటనే అరెస్టు చేయకపోతే ధర్నా చేస్తామంటూ రజక సంఘ నాయకులు హెచ్చరించారు. ఈ విషయంపై ఎస్ఐ రామిరెడ్డిని వివరణ కోరగా.. తమకు అందిన ఫిర్యాదుపై కేసు నమోదు చేశామని తెలిపారు. ఇలాంటి లైంగిక వేధింపులకు పాల్పడుతున్న కొందరు దుర్మార్గుల తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.