నేటి సమాజంలో మాంగళ్య బంధానికి మాయని మచ్చ తెచ్చేలా కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. క్షణిక శారీర సుఖం కోసం అడ్డదారులు తొక్కి, అడ్డమైన పనుల చేస్తున్నారు. వారికి సుఖాలకు అడ్డు వస్తున్న సొంత వారిని సైతం హతమార్చడానికి ఆలోచించడంలేదు. అలాంటి ఓ భార్య వివాహేతర సంబంధం.. భర్త ప్రాణాలను బలిగొంది. భార్య అక్రమ సంబంధాన్ని నిలదీసిన భర్తను.. ఆమె ప్రియుడు దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత సినిమా స్టోరీని తలపించే విధంగా మృతదేహాన్ని ఏడు ముక్కలుగా కోసి పలు ప్రాంతాల్లో పడేశాడు. ఈ హత్య ఘటన పెద్దపల్లి జిల్లా రామగుండం జరిగింది.
వివరాల్లోకి వెళ్తే…పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో మీసేవ ఉద్యోగిగా పని చేస్తున్నాడు శంకర్. అతనికి హేమలత అనే మహిళతో 16 సంవత్సారాల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు. హేమలత ఎన్టీపీసీ ఆస్పత్రిలో హెడ్ నర్సుగా పని చేస్తుంది. శంకర్ వాళ్ల అమ్మ, చెల్లి కూడా అదే ఆస్పత్రిలో పనిచేస్తున్నారు. ఆ ఆసుపత్రిలో స్వీపర్‌గా పని చేస్తున్న పోయిల రాజు అనే యువకుడితో హేమలతకు పరియచం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. తన సోదరి ద్వారా భర్త శంకర్‌కు విషయం తెలిసింది. ఈ విషయమై హేమలతకు..శంకర్ మధ్య గొడవలు జరిగేవి. తనపై అనుమానంతో తరచూ వేధింపులకు పాల్పడుతున్నాడంటూ శంకర్‌పై భార్య హేమలత గతంలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత పోలీసులు ఇద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు.
వారిద్దరి విషయమై శంకర్… రాజుకు కూడా ఫోన్ చేసి మందలించాడు. ఈ వ్యవహారం ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వివాదానికి దారితీసింది. ఇద్దరు తాగిన మత్తులో గొడవ పడ్డారు. అనంతరం రాజు… శంకర్ తలపై బీరు సీసాతో దాడి చేశాడు. ఈ దాడిలో శంకర్ అక్కడికక్కడే మరణించాడు. శవాన్ని సినిమా ఫక్కీలో మాయం చేయాలని రాజు నిర్ణయించుకున్నాడు. హత్య విషయాన్నిహంతకుడు రాజు… హేమలతకు చెప్పగా.. ఆమె కూడా ఈ హత్యను సమర్థించి ప్రియుడికి అండగా నిలిచింది. ఈ హత్య కేసు నుంచి తప్పించుకోవాలనే భావనతో రాజు…శంకర్ శరీరాన్ని ఏడు ముక్కలుగా కోసి వివిధ ప్రాంతాల్లో పడేశాడు. అయితే.. మాల్యాలపల్లి చెట్లపొదల్లో ఓ వ్యక్తి చేతులు నరికి పడేసి ఉన్నాయని స్థానికులు అందించిన సమాచారంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ తర్వాత తల, శరీర భాగాలు పలు చోట్ల లభ్యమయ్యాయి. పోలీసులు నిందితుడు రాజుతో పాటు హతుని భార్యను కూడా అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. ఈ సంఘటన పెద్దపల్లి జిల్లాలో సంచలనం సృష్టించింది.
