ముగురు ఆడపిల్లలు ఉన్న ఆ తండ్రి ఏనాడూ బాధపడలేదు.. ఉన్నంతలో అడిగిందల్లా ఇచ్చి వారికి ఏ లోటు లేకుండా చూసుకున్నాడు. మగ పిల్లలతో సమానంగా కుమార్తెలను ఉన్నత చదువులు చదివించాలని భావించాడు. తన శక్తి మేర బిడ్డల సంతోషం కోసం పాటుపడ్డ ఆ తండ్రిలో ఉన్న ఒకే ఒక్క అవలక్షణం.. కుల పిచ్చి. ఆ పిచ్చితోనే ప్రాణంలా పెంచుకున్న కుమార్తె ప్రాణం తీశాడు. కంటికి రెప్పలా కాపాడుకున్న కూతురు.. తమని కాదని ప్రేమ వివాహం చేసుకుందనే కారణంగా.. భార్య, మిగతా ఇద్దరు కుమార్తెల ప్రాణాలు తీశాడు. అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన తమిళనాడులోని నాగపట్టణం జిల్లాల్లో చోటుచేసుకుంది.
ఆ వివరాలు.. విక్కనాపురానికి చెందిన లక్ష్మణన్ (55), భువనేశ్వరి (40) దంపతులు.. స్థానికంగా నివసిస్తున్నారు. వీరికి ముగ్గురు కుమార్తెలు ధనలక్ష్మి (23), వినోదిని (20), అక్షయ (18) ఉన్నారు. వీరు ఇంటి ముందు ఓ టీ కొట్టు నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు.పెద్ద కుమార్తె ధనలక్షి అదే ప్రాంతంలోని వేరే సామాజికవర్గానికి చెందిన విమల్‌రాజ్ (25)ను ప్రేమించగా..అందుకు లక్ష్మణన్ అభ్యంతరం తెలిపాడు. దీంతో మూడు నెలల క్రితం ధనలక్ష్మి ఇంటి నుంచి వెళ్లిపోయి విమల్‌రాజ్‌ను పెళ్లి చేసుకుంది. కుమార్తె కులాంతర వివాహం చేసుకోవడంతో కుటుంబం పరువుపోయిందని భావించాడు. అప్పటినుంచి తీవ్రమనస్తానికి గురైన లక్ష్మణన్ టీ దుకాణం నడపకుండా ఇంటి పట్టునే ఉండేవాడు.
ఇది కూడా చదవండి : భార్య నీచం.. భర్త స్నేహితుడిపై మనసు పడి.. పక్కలోకి పిలిచి..!ప్రతిరోజూ ఉదయాన్నే 4 గంటలకే టీ బంకు తెరిచే లక్ష్మణన్ శుక్రవారం ఉదయం 7 గంటలైనా తెరవకపోగా ఎవ్వరూ ఇంటి నుంచి బయటకు రాలేదు. దీంతో స్థానికులు అనుమానంతో ఇంటిలోకి చూడగా భార్య, ఇద్దరు కుమార్తెలు రోకలి బండతో తలపై మోది హత్యకు గురైన స్థితిలో, లక్ష్మణన్ ఉరి వేసుకొని వేలాడుతూ కనిపించాడు. స్థానికులు వెంటనే పోలీసులుకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. కుమార్తె దళితుడ్ని ప్రేమ వివాహం చేసుకోవడం జీర్ణించుకోలేక కుటుంబ పెద్దే భార్య, ఇద్దరు కుమార్తెలను హతమార్చి తాను బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేల్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.