నేటి కాలం యువత ప్రేమ పేరుతో జాలీగా తిరుగుతూ సమయాన్ని వృధా చేస్తున్నారు. ఇక ఇంతటితో ఆగకుండా ఇద్దరి మధ్య వెలుగు చూసిన చిన్న చిన్న వివాదాలకు హత్యలు, ఆత్మహత్యల వరకు వెళ్తూ నిండు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తాజాగా ముంబైలో ప్రియుడు ప్రియురాలిపై దారుణ హత్యకు పాల్పడ్డాడు. తల, మొండం వేరు చేసి ఏకంగా ఆమె తలతో పారిపోయిన ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ప్రముఖ పర్యాటక ప్రాంతమైన మాథేరాన్‌లోని ఇందిరానగర్‌లో శనివారం ఓ ప్రేమ జంట లాడ్జ్ లో దిగింది. అయితే రాత్రంత అక్కడే ఉన్న ఈ జంట గదిలోనే ఉంది. ఉదయం గదిని శుభ్రం చేయడానికి సిబ్బంది గదిలోకి వెళ్లారు. అలా శుభ్రం చేస్తున్న క్రమంలో గది నిండ రక్తంతో నిండి ఉండి బెడ్ కింద తలలేని శవాన్ని చూసి సిబ్బంది ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. వెంటనే ఈ ఘటనపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక రంగంలోకి దిగిన పోలీసులు ఆ లాడ్జ్ లో ఉన్న మహిళ శవాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం పన్వేల్‌లోని ఉప జిల్లా ఆసుపత్రికి తరలించారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అనంతరం లాడ్జ్ లో ఉన్న సీసీ ఫుటేజీని, వారు నమోదు చేసిన పూర్తి వివరాలను పరిశీలించారు. మోహానికి మాస్క్ లు ధరించడం, తప్పుడు వివరాలు ఇవ్వడంతో ఈ కేసు పోలీసులకు కాస్త సవాల్ గా మారింది. ఇక కేసు దర్యాప్తులో భాగంగా బ్యాగులో దొరికిన గుర్తింపు కార్డు ఆధారంగా పోలీసులు ముంబైలోని గోరేగావ్‌కు చెందిన 30 ఏళ్ల పూనమ్ పాల్ గా గుర్తించారు. పోలీసులు ఐదు బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. తాజాగా మాథేరాన్‌లో జరిగిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.