ఇప్పుడు చెప్పుకోబోయే ఘటన వినగానే మీకు.. ఇంద్ర సినిమాలో ‘మొక్కే కదా అని పీకేస్తే.. పీక కోస్తా’ అని మెగాస్టార్ చెప్పిన డైలాగ్ గుర్తొస్తుంది. అచ్చు అలాంటి ఘటనే మధ్యప్రదేశ్ లో జరిగింది. తన వ్యవసాయ క్షేత్రంలో మొక్క పీకాడని 12 ఏళ్ళ బాలుడు.. ఏడేళ్ల బాలుడుని హత్య చేశాడు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
వివరాల్లోకి వెళ్తే.. మధ్యపరదేశ్ లోని బురుహాన్ పూర్ జిల్లా షేక్ పూర్ లో నిందితుడు తమ వ్యవసాయ క్షేత్రంలో కలియ తిరుగుతున్నాడు. ఆ సమయంలో అతనికి ఓ ఏడేళ్ల బాలుడు మొక్క పీకుతూ కనిపించాడు. ఆ ఘటన చూడగానే నిందుతుడు కోపంతో ఊగిపోయాడు. వెంటనే ఆ బాలుడుని పట్టుకుని విచక్షణారహితంగా కొట్టాడు. బాలుడు అపస్మారకస్థితిలోకి వెళ్ళిపోయాడు. కాసేపటికే ఆ బాలుడు మరణించాడు. శవ పరీక్షలు నిర్వహించగా.. భయంతో బాలుడి గుండె ఆగి.. చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ మొదలుపెట్టారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.