ఈ మధ్యకాలంలోని కొంతమంది యువకులు కామంతో రంకెలేస్తూ 5 ఏళ్ల బాలిక నుంచి 85 ఏళ్ల ముసలవ్వల వరకు ఎవరినీ వదలకుండా బలవంతంగా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఇలాంటివి రోజుకొకటి పుట్టుకొస్తూ సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేస్తున్నాయి. ఇదిలా ఉంటే మధ్యప్రదేశ్ లో ఇలాంటి ఘటనలోనే భర్తకు ఊహించని పరిణామం ఎదురైంది. భార్యపై భర్త బలవంతపు అత్యాచారానికి పాల్పడడంతో కోపంతో రగిలిపోయిన భార్య ఏకంగా భర్త జననంగాలు కోసింది.
తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్లోని తికమ్గఢ్ జిల్లాలో జాతర పరిధిలోని ప్రాంతంలోని ఓ భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. వీరికి 2019 వివాహం జరిగింది. అప్పుడప్పుడు చిన్న చిన్న వివాదాలతో సంసారాన్ని నెట్టుకుట్టు వస్తున్నారు. అయితే డిసెంబర్ 7వ తేదీన రాత్రి భర్త శారీరకంగా కలవాలని భార్యకు చెప్పాడు. ఇష్టం లేకపోవడంతో భార్యకు దీనికి నో చెప్పింది. అయినా పట్టుబట్టి భర్త భార్యపై బలవంతం చేసి అత్యాచారం చేశాడు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
దీంతో కోపంతో ఊగిపోయిన భార్య ఏం చేయాలో అర్థం కాక ఏకంగా ఇంట్లో ఉన్న పదునైన ఆయుదంతో భర్త జననంగాలు కట్ చేసింది. తీవ్ర రక్తస్రవం కావడంతో స్థానికులు ఆస్పత్రిలో చేర్పించారు. ఇక చికిత్స పొందుతు ఆయన పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అయితే ఈ ఘటనపై భర్త సోమవారం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఐపీసీ సెక్షన్ 324 కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. కాగా భార్యపై భర్త బలవంతంగా అత్యాచారం చేయడంతో భార్య చేసిన దాడిపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.