కామాంధుల వికృత చేష్టలకు మరో మహిళ బలైపోయింది. కాదు కాదు ఈ పాడు లోకంలో ఉండలేనంటూ ఓ తల్లి తనువు చాలించింది. కామంతో కళ్లు మూసుకుపోయి.. ఏడాదిన్నర బిడ్డ చంకలో ఉందనే ఇంగితం లేకుండా.. అచ్చోసిన ఆబోతుల్లా మీదపడి దాడి చేస్తుంటే నన్ను కాపాడే వాళ్లే లేరా అంటూ.. నిస్సహాయురాలిగా.. నిస్సత్తువుగా ఎదురుచూసి మోసపోయింది. ఎముకలు కొరికే చలిలో.. కదలలేని స్థితిలో.. బిడ్డను కాపాడుకోవాలనే ఆలోచనతో పోరాడి ఓడిన ఓ మహిళ ధీనగాథ ఇది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
ఈ అత్యంత కిరాతక, విషాద, వికృత ఘటన మరెక్కడో కాదు.. కర్నూలు జిల్లా డోన్ రైల్వేస్టేషన్ లో జరిగింది. ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు.. ఎక్కడికి వెళ్లాలనుకుంటోందో తెలీదు. చంకలో ఏడాదిన్నర బిడ్డతో ఓ బీహార్ మహిళ డోన్ రైల్వే స్టేషన్ లో దిగింది. అక్కడున్న కామాంధుల కబంధ హస్తాల్లో చిక్కుకుంది. గుక్కపెట్టి ఏడుస్తున్న ఆ పసివాడి ఏడుపు కూడా వారిని కదిలించలేకపోయింది. పసివాడితో ఉన్న మహిళపై జాలి చూపించాల్సింది పోయి.. కామవాంఛ తీర్చుకున్నారు. మృగాల్లా మీదపడి విచక్షణారహితంగా దాడి చేశారు. ఎముకలు కొరికే చలిలో కదలలేని స్థితిలో ఆ మహిళ రాత్రంతా అలాగే ఉండిపోయింది. సాయం చేసేవాళ్లు లేక.. తెల్లవారేసరికి ఓ అనాథశవంగా మారింది. తల్లిశవం పక్కనే ఏడ్చుకుంటూ ఆ పసివాడు అలాగే ఉండిపోయాడు.
పోలీసులు పసిబిడ్డను శిశుసంరక్షణ కేంద్రానికి తరలించారు. ప్రత్యక్షసాక్షి చెప్పిన వివరాల ప్రకారం నిందితుల కోసం వేట మొదలు పెట్టిన పోలీసులు.. ఇద్దరు ఆటో డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఉయ్యాల్లోని పసిబిడ్డ నుంచి నడుం ఒంగిన ముసలమ్మదాకా ఎవరిని వదులుతారు? ఉరిశిక్ష, ఎన్ కౌంటర్, జీవితఖైదు ఇలా ఎంత కఠిన శిక్షలు వేసినా ఎందుకు మార్పు రావడం లేదు? ఈ స్వతంత్ర భారతంలో స్త్రీ స్వేచ్ఛగా, ధైర్యంగా, ఒంటరిగా తిరిగేది ఎప్పుడు? ఇలాంటి మృగాళ్ల ఆగడాలు ఆగేదెప్పుడు? స్త్రీ స్వేచ్చని, జీవితాన్ని కాలరాస్తున్న ఇలాంటి మృగాళ్ళకి ఏ శిక్ష విధించాలి? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.