దాంపత్య జీవితంలో అరమరికలు సర్వసాధారణం. కోపతాపాలు.. క్షణికావేశంలో మాటలు అనుకోవడం చూస్తూనే ఉంటాం. అందరి వైవాహిక జీవితాల్లో అలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి. కానీ, కొందరికి అవి నిత్యకృత్యాలు. పప్పులో ఉప్పు తగ్గిందనో, కోరిన కూర చేయలేదనో కట్టుకున్న భార్యకు నరకం చూపిస్తుంటారు. కారణం లేకుండానే కొట్టడం.. చిత్రహింసలకు గురిచేయడం చేస్తారు. అలాంటి ఓ తాగుబోతు భర్త వేధింపులు తట్టుకోలేక గర్భిణి ఆత్మహత్యకు పాల్పడింది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
ఈ విషాద ఘటన కర్ణాటకలోని రామనగర మంజునాథనగరంలో ఈ దంపతులకు 9 నెలల క్రితం వివాహం జరిగింది. స్థానికుల చెప్పిన వివరాల ప్రకారం.. మొదట్లో బాగానే చూసుకున్నాడు. ఎంతో అన్యోంన్యంగా ఉన్నారు. తర్వాత భర్త తాగుడుకు బానిసయ్యాడు. గత ఐదారు నెలలుగా రోజూ తాగొస్తున్నాడు. తాగిన మైకంలో భార్యను వేధింపులకు గురి చేస్తున్నాడు. కావాలని అలా చేస్తున్నాడా? తాగిన మత్తులో అలా చేస్తున్నదీ తెలియదు. ఆమె ఐదు నెలల గర్భిణి అని కూడా చూడకుండా చిత్రహింసలు పెట్టసాగాడు.
భర్త వేధింపులు తాళలేక ఆ గర్భిణి షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఓ రోజు ఇంట్లో భర్తలేని సమయం చూసి ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఏ తప్పు చేయని ఓ పసి ప్రాణం ఈ లోకాన్ని చూడకుండానే వెళ్లిపోయింది. ఓ తాగుబోతు చేష్టలకు రెండు ప్రాణాలు బలైపోయాయి. భర్తకు బుద్ధి చెప్పమని పెద్దలకు చెప్పుకోవాల్సింది.. అలా ప్రాణం తీసుకుంటుందా అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు ప్రాణాలు పోవడానికి కారణమైన ఈ భర్తను ఏమనాలి? ఏ శిక్ష వేయాలి? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.