దేశంలో గత కొంత కాలంగా రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకు వస్తున్నా.. రోడ్డు భద్రతా చర్యలు తీసుకుంటున్నా.. ప్రమాదాలను మాత్రం అరికట్టలేకపోతున్నాయి. డ్రైవర్లు మద్యం సేవించి నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు. తాజాగా కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఓ కారు బీభత్సం సృష్టించింది.
కరీంనగర్ సిటీలోని కమాన్ చౌరస్తా సమీపంలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన ఓ కారు.. రోడ్డుపక్కన గుడిసెలలోకి దూసుకెళ్లడంతో నలుగురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను ఫరియాద్, సునీత, లలిత, జ్యోతిగా గుర్తించారు. ఈ దారుణానికి సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటీన ఘటాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మరో 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
గాయపడ్డ మరో తొమ్మిది సమీపంలోని ఆస్పత్రులకు తరలించి, చికిత్స అందిస్తున్నారు. కారు డ్రైవర్ పరారీలో ఉన్నాడని చెప్పారు. ఆ కారుపై 9 చాలాన్లు ఉన్నాయని, అన్నీ ఓవర్‌స్పీడ్‌కు చెందనవేనని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.