ఈరోజుల్లో ప్రియురాలు/ప్రియుడుకి ఇస్తున్న విలువ కట్టుకున్న భార్య/భర్తకు ఇవ్వడం లేదు. కొందరు మూడు ముళ్ల బంధం కంటే మూడు క్షణాల సుఖానికే ఎక్కువ విలు ఇస్తున్నారు. అందుకోసం భార్య, పిల్లలు, తల్లిదండ్రులు ఇలా ఎవరు అడ్డొచ్చినా కడతేర్చేందుకు అస్సలు వెనకడుగు వేయడం లేదు. రానురాను ఆ పోకడ మరీ పేట్రేగి పోతోంది. కొందరు మహిళలు సైతం సాటి ఆడదాని కాపురాన్ని కూల్చేందుకు ఏ మాత్రం ఆలోచించడం లేదు. ఈ వార్తలో అయితే సొంత చెల్లే అక్క కాపురాన్ని నిలువునా నాశనం చేసింది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
ఈ వార్తకు సంబంధించిన అసలు పేర్లను మార్చడం జరిగింది. వివరాల్లోకి వెళితే.. హర్యానాలోని రేవాడి ప్రాంతంలో ఈ దారుణం జరిగింది. నరేశ్ సింగ్ తన భార్య కుసుమతో ఆనందంగా జీవిస్తున్నాడు. చూసిపోతానంటూ కుసుమ చెల్లి వస్తుంది. ఆ తర్వాత బావ నరేశ్ సింగ్ పై మరదలి కన్ను పడింది. ఎలాగైనా బావను లొంగదీసుకోవాలని భావిచింది. చిన్నగా బావను లైన్ లో పెట్టడం మొదలు పెట్టింది. బావ కూడా మరదలి బుట్టలో పడిపోయాడు. నాలుగు రోజులు ఉండిపోతాన్న చెల్లి రెండు నెలలు గడుస్తున్నా ఇల్లు కదలడం లేదు.
చెల్లి, భర్త వ్యవహారంలో కుసుమకు అనుమానం మొదలైంది. ఓ రోజు పని మీద బయటకి వెళ్తున్నట్లు వెళ్లింది. ఆ గ్యాప్ లో మరదలితో కాలు జారాడు ఆ బావ. ఇంకేముంది చెల్లి- భర్త చీకటి చేష్టలను రెండ్ హ్యాండెడ్ గా పట్టుకుంది కుసుమ. ఇద్దరినీ నిలదీసింది. నరేశ్ సింగ్ కాళ్లా వేళ్లా పడి మారిపోయానంటూ నమ్మబలికాడు. మరదలిని కూడా ఇంటికి పంపేస్తానని మాటిచ్చాడు. అంతా బాగానే ఉందనుకున్న సమయంలో ఓ రోజు కుసుమ ఇంట్లో శవంగా మారింది. దొగలు పడి తన భార్యను హత్య చేశారని నరేశ్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
దర్యాప్తు మొదలు పెట్టిన పోలీసులు తీగ లాగితే అసలు డొంకంతా కదిలింది. పోలీసులకు అక్కడ దొంగతనం జరిగిన ఆనవాలు కనిపించలేదు. పైగా బావామరదళ్ల తెరచాటు సరసాల వ్యవహారం కూడా పోలీసులకు తెలిసి పోయింది. మరదలిపై మోజులో భార్యను నరేశ్ సింగే హత్య చేసుంటాడని పోలీసులు కూడా అనుమానం వ్యక్తం చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నరేశ్ సింగ్ చేసిన దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.