సమాజంలో అక్రమ సంబంధాలు ఎంత పెరుగుతున్నాయో.. వాటి ఫలితంగా నేరాలు కూడా అంతే పెరుగుతున్నాయి. ఐదునిమిషాల సుఖం కోసం తప్పుడు దారుల్లో వెళ్లి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇంకొందరు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇంట్లో ఉన్న వారిని వదిలేసి పడక సుఖం కోసం రోడ్లెక్కితే.. లేనిపోని కష్టాల్లో పడుతున్నారు. అలాంటి యువతి ఒకామె.. పెళ్లైన వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఆ సంబంధం ఆమె ప్రాణాల మీదకు తీసుకొచ్చింది. వీరి బంధం తెలుసుకున్న ఆ భార్య యువతిని కిడ్నాప్ చేయించి.. ఆమెపై దాడి చేసింది. అక్కడితో ఆగకుండా ఆమె యోనిలో ఎర్ర కారం పెట్టి రోడ్డుపై పడేసింది. గమనించిన స్థానికులు ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
వివరాల్లోకి వెళ్తే.. ఈ అత్యంత దారుణమైన, హేయమైన చర్య గుజరాత్ రాష్ట్రం, గాంధీనగర్ నియోజకవర్గం రాజ్ కోట్ లో వెలుగు చూసింది. రాజ్ కోట్ లో ఓ యువతి రోడ్డుపక్కన స్పృహ లేకుండా పడి ఉంది. ఆమెను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత పోలీసులు విషయం తెలుసుకుని కంగు తిన్నారు. ఆమెపై దాడి ఎందుకు జరిగిందని పోలీసులు బాధితురాలిని ప్రశ్నించారు. ఆమె అసలు కథ చెప్పుకొచ్చింది. తను ఓ పెళ్లైన వ్యక్తితో రిలేషన్ లో ఉందని తెలిపింది. తరచూ వాళ్లు ఫోన్ మాట్లాడుకునే వారని. బయట కూడా కలుస్తుండే వారు. అలా కొన్నాళ్లపాటు వారి సంబంధం కొనసాగింది.
ఆ విషయం ఆమె భార్యకు తెలిసిపోయింది. యువతికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంది. ఇద్దరు మనుషులను పురమాయించి ఆ యువతిని కిడ్నాప్ చేసించింది. ఆ తర్వాత ఆమె చేతులు తాళ్లతో కట్టి తీవ్రంగా కొట్టారు. ఇంకా ఆ మహిళ కోపం చల్లారలేదు. ఆ తర్వాత ఆమె కాళ్లను తాళ్లతో లాగి కట్టి యువతి యోనిలో ఎర్ర కారం పెట్టింది. ఆమెను లాక్కొచ్చి రోడ్డుపై పడేశారు. అక్రమ సంబంధం వల్లే ఇలా జరిగినట్లు బాధితురాలు కూడా పోలీసులకు తెలిపింది.
ఇదీ చదవండి: పెళ్లైన నాలుగు నెలలకే వేధింపులు.. హార్పిక్ తాగించి ఐసీయూకి తరలింపు..
యువతి ఫిర్యాదుతో మహిళపై అపహరణ, హత్యాయత్నం కేసు నమోదు చేశారు. తన భర్తతో అక్రమ సంబంధం పెట్టుకుందనే కోపంతోనే అలా చేసినట్లు అంగీకరించింది. ఆమెను, సహకరించిన ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇలాంటి విషయాలు ఏమున్నా కూడా సరైన ఆధారాలతో పోలీసులను ఆశ్రయించాలని సూచించారు. ఇలా చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే చూస్తూ ఊరుకోమంటూ పోలీసులు హెచ్చరించారు. అక్రమ సంబంధాల విషయంలో ఎవరూ తొందర పడొద్దని తెలిపారు. ఆధారాలతో వస్తే బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.