ఒకప్పుడు భర్తలు భార్యలపై దారుణంగా దాడిగి పాల్పడేవారు. నేటికాలంలో చాలా వరకు తగ్గిన ఇప్పటికి అక్కడక్కడ కొనసాగుతున్నాయి. అది అలా ఉంచితే..భార్యలు సైతం భర్తలపై దాడులకు పాల్పడుతున్నారు. కొందరైతే ఏకంగా భర్తలను దారుణంగా హత్య చేస్తున్నారు. కారణం ఏదైన ఇలాంటి ఘోరాలు బాగా పెరిపోయాయి.తాజాగా ఓ మహిళ తన భర్త తల తెగనరికి దానికి సంచిలో వేసుకుని గుడి ముందు తీసుకెళ్లి పడేసింది. ఒళ్లు గగ్గురు పడిచే ఈ ఘటన త్రిపురలో చోటు చేసుకుంది.
మృతుడి పెద్ద కుమారుడు చెప్పిన వివరాల ప్రకారం..త్రిపుర రాష్ట్రంలోని ఖోవై జిల్లాలోని గాంధీ కాలనీ లో రబీంద్ర తంతి(50)అనే వ్యక్తి తన భార్యతో కలసి జీవినం సాగిస్తున్నాడు. వారిద్దరు కూలీ పనులుచేసుకుంటు పిల్లలను పోషిస్తున్నారు. కొద్దికాలంల నుంచి రబీంద్రతంతి భార్య వింతగా ప్రవర్తిసుండేది. అందుకు ఆమెకు ఓ క్షుద్ర వైద్యుడి వద్ద చికిత్స అందిస్తున్నారు. ఆమె ఇప్పటివరకు శాకాహారం మాత్రమే తినేది. అయితే శుక్రవారం రాత్రి చికెన్ తో భోజనం చేసింది. భోజనాలు అయిన తర్వాత అందరం పడుకోగా…భర్త తలను పదునైన ఆయుధంతో నరికింది.
పిల్లలు కేకలు వేసే సరికి భర్త తలను ప్లాస్టికి సంచిలో వేసుకుని బయటకి పరుగులు తీసింది. వారి కులదేవత గుడి ముందు భర్త తలను ఉంచింది. ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆమెను అదుపులోకి తీసుకున్నారు. హత్యకు గల కారణాలు ఇంక తెలియరాలేదని పోలీసులు తెలిపారు. మరి.. ఈఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.