ప్రస్తుతం సమాజం టెక్నాలజీతో శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇలాంటి సాంకేతిక యుగంలో కూడా ఎక్కడో ఓ చోట మూఢ నమ్మకాలు ఇంక కనిపిస్తున్నాయి. మారుమూల గ్రామాల్లోని ప్రజల్లో కొందరు ఇప్పటి మూఢ నమ్మకాలు బలంగా విశ్వసిస్తారు. వారి బలహీనతను ఆసరాగా చేసుకుని చాలామంది నకిలీ బాబాలు తమ పబం గడుపుకుంటున్నారు. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న ప్రబుద్ధులు వారి నుంచి అందిన కాడికి దోచుకుంటున్నారు. అంతే కాకా తమ వద్దకు వచ్చిన మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ మహిళ తన కూతురికి పెళ్లి కావడం లేదని ఓ బాబాను ఆశ్రయించింది. దీన్ని ఆసరాగా చేసుకున్న అతను.. తల్లీ, ఆమె తోపాటు వచ్చిన ముగ్గురు కూతుర్లకు మత్తుమందు ఇచ్చి వారిపై దారుణానికి తెగబడ్డాడు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఓ మారుముల ప్రాంతానికి చెందిన ఓ మహిళ.. తన పెద్ద కూతురికి ఎన్ని సంబంధాలు చూసిన పెళ్లి కావడంలేదు. మూఢనమ్మకాలను బలంగా నమ్మే ఆ మహిళ.. తన కూతురికి ఏమైన దోషం ఉందేమో అని భావించింది. దీంతో యోలా తాలుకాలోని నాగ్డే గ్రామం లోని ఓ బాబాను ఆశ్రయించింది. తన కూతురికి ఎలాగైనా వివాహం జరిగేలా చూడాలని కోరింది. సదరు మహిళ ఆవేదనను ఆసరాగా తీసుకున్న బాబా.. యువతిపై చేతబడి జరిగిందని చెప్పాడు. దీని పరిష్కారానికి తానిచ్చే జలాన్ని తాగాలని సూచించాడు. దీంతో తల్లితో సహా ముగ్గురు యువతులు ఆ జలాన్ని తాగారు. అనంతరం స్పృహ తప్పి పడిపోయారు. స్పృహలో లేని వారిపై సోదరుడితో కలిసి దొంగబాబా అత్యాచారం చేశాడు.
దీనికి సంబంధించిన దృశ్యాలను వీడియో తీశాడు. ఈ విషయాన్ని ఎవరికైన చెబితే సోషల్ మీడియాలో పెడతానని వారిని లోబరుచుకుని రెండున్నరేళ్లుగా తల్లితో పాటు ఆ యువతులపై అత్యాచారానికి పాల్పడుతున్నాడు. అంతే కాకుడం ఇటీవల డబ్బులు కూడా డిమాండ్ చేశాడు. చివరికి నకిలీ బాబా వేధింపులు తట్టుకోలేక బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. మన బలహీనతలు, మూఢనమ్మకాలు మనకు ఎంతటి అనర్థాన్ని తెచ్చిపెడుతున్నాయో చూశారుగా. మరి.. ఈఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.