మృత్యువు అనేది ఏ రూపంలో వస్తుందో తెలుసుకోవడం ఎవరికి తెలియదు. సంతోషంగా ఉన్న మనకున్న సమయంలో ఉహించని ఘటనలు జరుగుతాయి.తాజాగా అలా ఎంతో సంతోషంగా ఉన్న ఓ కుటుంబంతో విధి ఆడిన వింత నాటకం ముగ్గురి ప్రాణాలను బలితీసుకుంది.నిమిషాల వ్యవధితోల మూడు తరాల చెందిన ముగ్గురు జల సమాధి అయ్యారు. ఈ విషాద ఘటన వరంగల్ జిల్లా లో జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం చిన్న గురిజాల గ్రామానికి చెందిన కృష్ణమూర్తి అనే రైతు తన కొడుకు నాగరాజు, ఇద్దరు మనవళ్లు ఉన్నారు. వారితో కలసి కృష్ణమూర్తి పొలానికి వెళ్లాడు. కృష్ణమూర్తి, నాగరాజు కలిసి మొక్కజొన్నలను బస్తాలో నింపుతుండగా.. బాలుడు దీపక్ అక్కడే ఉన్న చెరువు వద్దకు వెళ్లి స్నానానికి దిగాడు. అయితే చెరువు లోతు తెలియకపోవడంతో.. దీపక్ మునిగిపోయాడు. దాన్ని గమనించిన కృష్ణమూర్తి.. మనవడిని కాపాడేందుకు చెరువులోకి దిగాడు. దురదృష్టవశాత్తు బాలుడితో పాటు ఆయన కూడా మునిగిపోయాడు.
ఆ విషయాన్ని మరో మనవడు దూరంగా ఉన్న నాగరాజుకు వెళ్లి చెప్పాడు. అక్కడి చేరుకున్న నాగరాజు వారిని కాపాడే ప్రయాత్నం చేశాడు. ఈ క్రమంలో చెరువు లోతు ఎంత ఉందో తెలియక నీటిలో మునిగిపోయాడు. దీంతో ముగ్గురు నీట మునిగి విగజ జీవులుగా మారారు. ఒకే కుటుంబంలోని మూడు తరాలు జలసమాధి అయ్యాయి. ధైర్యం పెంచాల్సిన ఇంటి పెద్ద కన్నుమూశాడు. బాధ్యలు బుజాన వేసుకున్న వ్యక్తి మృతి చెందాడు. ఇంట్లో అల్లరి చేస్తూ తిరుగుతున్న చిన్నోడు తిరిగిరాని లోకలకు వెళ్లిపోయాడు. ఒకే రోజు మూడు తరాల వారిని కోల్పోవడంతో ఆ కుటుంబాన్ని ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.