నేటికాలంలో భార్యాభర్తల బంధాన్ని కొందరు అపహాస్యం చేస్తున్నారు. పెళ్లైన వ్యక్తులు కొందరు కట్టుకున్న వాళ్లని కాదని పరాయి సుఖం కోసం పాకులాడుతున్నారు. ఇక దంపతులు తమ భాగస్వామికి తెలియకుండా అక్రమ సంబంధాల్లో వేలు పెట్టి చివరికి పచ్చని సంసారంలో నిప్పులు పోసుకుంటున్నారు. ఇలాంటి వివాహేతర సంబంధాల కారణంగా ఇప్పటికీ ఎన్నో సంసారాలు రోడ్డున పడ్డాయి. పరాయి శరీరం మోజులో పడిన కొందరు ఆడవారు భర్తలను చంపేందుకు కూడా వెనుకాడటం లేదు. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ వివాహిత అక్రమ సంబంధాన్ని.. ఆమె భర్త బలయ్యాడు. తాజాగా కర్ణాటకలో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లా చాంబే గ్రామానికి చెందిన ఆనంద్ అలియాస్ అనిల్, చైత్ర భార్యాభర్తలు. వీరిద్దరు ఐదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరి ప్రేమకు గుర్తుగా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఆనంద్ ట్రక్ డ్రైవర్ గా పనిచేస్తూ భార్య పిల్లలను పోషిస్తున్నాడు. అలా కొంతకాలం పాటు వారి కాపురం ఎంతో హాయిగా సాగింది. అయితే కొన్ని నెలల క్రితం నుంచి చైత్ర బుద్ది వక్రమార్గంలోకి వెళ్లింది. అదే గ్రామంలో ఉండే చలపతి అనే యువకుడితో చైత్రకి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా అక్రమ సంబంధానికి దారితీసింది. భర్త లేని సమయంలో చైత్ర,చలపతితో పక్కపంచుకునేది. ఇలా కొంతకాలం పాటు ఏ ఆటంకాలు లేకుండా వారి పాడుపని కొనసాగింది.
ఈ విషయం తెలుసుకున్న అనిల్.. భార్య చైత్ర, ఆమె ప్రియుడు చలపతిని గట్టిగా హెచ్చరించాడు. అయితే అతడి మాటలు పట్టించుకోని వారిద్దరు గత రెండు నెలల నుంచి మరింత దగ్గరయ్యారు. ప్రియుడు ఒడిలో సేద తీరుతూ చైత్ర రోజులు గడిపింది. ఈ విషయంపై అనిల్, చైత్ర ల మధ్య గొడవలు జరుగుతుండేవి. ఇక ప్రియుడు మోజులో పడిన చైత్ర భర్త అడ్డు తొలగించుకోవాలని భావించింది. అనిల్ ను చంపేందుకు ప్రియుడితో కలిసి చైత్ర ఓ పథకం రచించింది. అందులో భాగంగా చైత్ర తన సోదరుడి స్నేహితుడైన పృథ్వీరాజ్ అనే వ్యక్తిని కలిసింది. భర్తను చంపేందుకు అతడితో చైత్ర డీల్ కుదుర్చుకుంది. అనిల్ ను చంపితే లక్ష రూపాయిలు ఇచ్చే విధంగా వారి మధ్య ఒప్పందం జరిగి.. అడ్వాన్స్ గా ఐదు వేలు ఇచ్చింది. ఈక్రమంలో హోస్కోట మండలంలోని భీమకనహళ్లీ సమీపంలో ఆనిల్ ను నవీన్ అనే మరొక వ్యక్తి సాయంతో పృథ్వీరాజ్ చంపేశాడు.
కొన్ని రోజుల తరువాత అటుగా వెళ్తున్న కొందరు కుళ్లిన స్థితిలో ఉన్న ఓ మృతదేహాన్ని గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చెేపట్టారు. మృతుడి భార్యపై అనుమానంతో ఆమె కాల్ డేట్ పరిశీలించారు. ఈక్రమంలో చలపతితో ఎక్కువ సార్లు మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో వారిద్దరి అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయట పడింది. దీంతో చైత్ర, చలపతి, పృథ్వీరాజ్ ను అరెస్టు చేసిన పోలీసులు నవీన్ కోసం గాలిస్తున్నారు.