నేటికాలంలో మనషుల మధ్య నమ్మకం కొరవడుతుంది. అపనమ్మకం, అనుమానం అనేవి పెరిగిపోతున్నాయి. ఇవి చివరికి భార్య భర్తల మధ్య సైతం చేరి వారి సంసారంలో నిప్పులు పోస్తున్నాయి. కొందరు దంపతులు ఒకరిపై మరొకరి నమ్మకం లేక నిత్యం అనుమానంతో జీవిస్తున్నారు. ఇద్దరిలో ఏ ఒకరి మొబైల్ కి మెసేజ్, ఫోన్ కాల్ వచ్చిందేటే అనుమానిస్తారు. తాజాగా అలా ఓ భార్యపై భర్తకు వచ్చిన అనుమానం మరొక వ్యక్తి ప్రాణం తీసింది. ఏం చేస్తున్నావు అని భార్య ఫోన్ కు వాయిస్ మెసేజ్ రావడంతో అనుమానం పెంచుకున్న ఆ భర్త.. మెసేజ్ పంపిన వ్యక్తిని దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన కాకినాడ రూరల్ ప్రాంతంలో చోటుచేసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం.. కాకినాడ రూరల్ లోని రమణయ్యపేట గ్రామంలో గైగోలుపాడు గంజావారి వీధిలో సూరంపూడి దుర్గాప్రసాద్ దంపతులు నివసిస్తున్నారు. గతంలో వారికి సమీపంలోనాగేశ్వరావు అనే వ్యక్తి కుటుంబం ఉండేది. అప్పట్లో ఇరు కుటుంబాల మధ్య మాటలు కొనసాగుతుండేవి. ఈ క్రమంలో కొన్నాళ్ల క్రితం నాగేశ్వరావు..అదే గ్రామంలోని వేరే ప్రాంతానికి మకాం మార్చాడు. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం దుర్గాప్రసాద్ భార్యకు నాగేశ్వరరావు ఏం చేస్తున్నావని వాయిస్ మెసేజ్ పెట్టినట్లు సమాచారం. దీంతో ఆ మెసేజ్ చూసిన దుర్గాప్రసాద్‌కు కోపం వచ్చింది.
నాగేశ్వరావుకు తన భార్యతో వివాహేతర సంబంధం ఉండవచ్చని అనుమానించి అతడి ఇంటికి వెళ్లి గొడవకు దిగాడు. ఈ క్రమంలో అక్కడే ఉన్న ఇనుప పైపుతో నాగేశ్వరావు తలపై దాడి చేశాడు. తలపై బలమైన గాయామవ్వడంతో నాగేశ్వరరావును స్థానికులు జీజీహెచ్‌లో చేర్చగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి వదిన రమణమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై ఎన్.సురేష్‌బాబు తెలిపారు. కేసును సీఐ మురళీకృష్ణ దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.