Hyderabad District:హైదరాబాద్ అబ్దులాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో లో దారుణం చోటుచేసుకుంది. అబ్దులాపూర్ మెట ప్రాంతంలోని కొత్తగూడెం రైల్వే బ్రిడ్జి సమీపంలో నగ్నంగా ఉన్న యువతీ, యువకుల మృతదేహాలను స్థానికులు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించారు. రెండు మృతదేహాలు కూడా పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఉన్నాయి. అక్కడే ఉన్న ఎల్లో కవర్ పై యువకుడి డెడ్ బాడీ ఉండగా మరికొంత దూరంలో యువతి మృతదేహం ఉంది. యువతి మొహం గుర్తుపట్టడానికి వీలు లేని స్థితిలో ఉంది. హత్య చేసి తగులబెట్టినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. యువకుడి పేరు యశ్వంత్ గా గుర్తించారు. ఏకాంతంగా ఉన్న జంటపై దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ హత్యలు మూడు రోజుల క్రితమే జరిగినట్లు భావిస్తున్నారు. మరి.. ఈ దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.