అమ్మాయిలు, డబ్బులు, ఆటలు వంటి వాటి విషయంలో యువకుల మధ్య గొడవలు జరుగుతుంటాయి. అయితే చిన్నగా మొదలైన గొడవలు పెద్దగా మారి ప్రాణాలను బలి తీసుకుంటాయి. తాజాగా తమిళనాడులో విద్యార్థుల మధ్య మొదలైన చిన్న గొడవ.. పెద్ద ఘర్షణగా దారి తీసింది.
విద్యార్థులు, యువకుల మధ్య చిన్న చిన్న గొడవలు జరుగుతుంటాయి. కానీ కొన్ని సందర్భాల్లో చిన్నగా మొదలైన ఈ గొడవలు పెద్దగా మారి.. ప్రాణాలను బలి తీసుకుంటాయి. ముఖ్యంగా అమ్మాయిలు, డబ్బులు, గొప్పలు చెప్పుకునే విషయంలో యువకులు, విద్యార్థుల మధ్య ఘర్షణలు జరుగుతుంటాయి. తాజాగా తమిళనాడులో విద్యార్థుల మధ్య పెద్ద గొడవ జరిగింది. కత్తులు, రాళ్లతో పరస్పరం ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు. ఈ ఘటనల పలువురు గాయపడగా.. ఆరుగురి పరిస్థితి విషయంగా ఉంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
తమిళనాడులోని చెన్నై నుంచి సూళ్లూరు కు వెళ్తున్న లోకల్ ట్రైన్ లో కాలేజీ విద్యార్థుల ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో రెండు కాలేజీ ల విద్యార్థుల మధ్య చిన్నపాటి టాపిక్ మొదలైంది. ఎవరి కాలేజీ గొప్ప అనే విషయంలో విద్యార్థుల మధ్య వాగ్వాదం మొదలైంది. ఈ క్రమంలో వారి మధ్య మాటకు మాట పెరిగి.. చినికి చినికి గాలివాన తుఫాన్ గా మారినట్లు పెద్ద ఘర్షణకు దారితీసింది. లోకల్ ట్రైన్ ను ఆపి.. కిందకు దిగి మరి విద్యార్థులు కొట్టుకున్నారు. కత్తులు, రాళ్లలతో పరస్పరం విద్యార్థులు దాడి చేసుకున్నారు. దీంతో కాసేపు ట్రైన్ లో వారందరు భయందోళనకు గురయ్యారు.
అసలు ఏమి జరుగుతుందో తెలియక ప్రయాణికులు షాక్ లో ఉండిపోయారు. ఈ ఘర్షణలో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషయంగా ఉండటంతో చెన్నై ఆస్పత్రికి తరలించారు. స్థానికుల ఆందించిన సమాచారంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. విద్యార్థుల ఘర్షణపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరి.. ఇలా చిన్న విషయాలకు విద్యార్థులు పంతాలకు పోయి… ప్రాణాల మీదకు తెచ్చుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.