ఈ మధ్యకాలంలో ఎక్కడ విన్నా, ఎక్కడ చూసిన వివాహేతర సంబంధాల వార్తలే. కలికాలం కాబట్టేనేమో చాలా మంది పవిత్ర బంధాల కంటే అపవిత్ర బంధాలవైపు ఆకర్షితులవుతున్నారు. ఎంతలా అంటే పరాయి వాడితో పడక సుఖం కోసం పేగు తెచ్చుకు పుట్టిన బిడ్డలను సైతం అడ్డుతొలగిస్తున్నారు. తాజాగా భర్త చనిపోయిన మహిళ.. వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ క్రమంలో ప్రియుడి మోజులో పడి అభం శుభం తెలియని పిల్లలపై దారుణానికి పాల్పడింది. ఈ ఘటన అనంతపురం చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం గుంతకల్లుకు చెందిన ఓ వ్యక్తి అప్పుల బాధతో నాలుగేళ్ల కిందట ఆత్మహత్య చేసుకున్నాడు. అతనికి భార్య, ఇద్దరు మగ పిల్లలున్నారు. భర్త చనిపోవడంతో కుటుంబ భారం అంత ఆ మహిళపై పడింది. దీంతో తన ఇద్దరు పిల్లలను గుంతకల్లులోని తన పుట్టింట్లో వదిలేసి అనంతపురం వెళ్లింది. అక్కడ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పని చేస్తోంది. ఈ క్రమంలో అక్కడే పరిచయమైన ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అక్కడే రూమ్ తీసుకుని ప్రియుడితో ఎంజాయ్ చేసేది. అప్పుడప్పుడూ గుంతకల్లుకు వెళ్లి తన పిల్లలన చూసి వస్తుండేది. ఈ క్రమంలో ప్రియుడితో కలిసి వారం క్రితం గుంతకల్లుకు వెళ్లింది. ఈ వారంలో వారిద్దరికి ఓ దుర్బుద్ధి పుట్టింది. పిల్లలిద్దరూ తమ పడక సుఖానికి అడ్డుగా ఉన్నారని భావించారు.
దీంతో ఆమె, ప్రియుడు.. మద్యం సీసాలు పగులగొట్టి, వాటిని బాగా వేడి చేసి వాటితో ఓ బాలుడి శరీరంపై వాతలు పెట్టాడు. మరో బాలుడి తలపై బలంగా కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో భయభ్రాంతులకు గురైన ఆ చిన్నారులు గట్టిగా కేకలు వేయగా.. ఇరుగూ పొరుగు వారొచ్చి పిల్లలను కాపాడారు. ఇక్కడ కూడా ప్రియుడిని కాపాడలానే భావించి ఆ కామాపిశాచి. పిల్లలకు భయం ఉండాలనే ఉద్దేశంతో తానే అలా హింసించానని ఓ అబద్ధం చెప్పుకొచ్చింది. మరి ఈఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.