వివాహేతర సంబంధాలే నిండు జీవితాలను రోడ్డున పడేలా చేస్తున్నాయి. పొరపాటున దారితప్పిన కొందరు వివాహితలు ఇంట్లో వయసుకొచ్చిన కూతురుందని కూడా చూడకుండా వివాహేతర సంబంధాల్లో అడుగు పెడుతూ ఎటు కాకుండా పోతున్నారు. అచ్చం ఇలాంటి ఘటనలో చివరికి తల్లితో పాటు కూతురు కూడా జైలు జీవితం గడపాల్సి వచ్చింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బీహార్‌లోని దర్భంగా పరిధిలో ఓ మహిళా కూతురితో పాటు నివాసం ఉంటుంది. అయితే కొన్ని రోజుల క్రితం భర్త ఆనారోగ్య కారణాలతో మరణించాడు.
అప్పటి నుంచి కూతురితో పాటే ఉంటూ జీవితాన్ని ఈడ్చుకుంటు వస్తుంది. ఈ నేపథ్యంలోనే భర్త మరణించడంతో ఆ వివాహిత ఇంటి పక్కన ఉండే ఓ వ్యక్తితో పరిచయం పెంచుకుంది. ఆ పరిచయం కాస్త ఇద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారి తీసింది. దీంతో సమయమొచ్చినప్పుడల్లా ఆ మహిళ అతనితో సరసాలకు దిగుతూ ఇద్దరు కూతురు ముందే బరితెగించేవారు. ఇక ఈ విషయం కూతురికి తెలియటంతో కొన్నాళ్ల పాటు సైలెంట్ గా ఉండిపోయింది. అలా ఆ వ్యక్తి వివాహితతో కలిసే క్రమంలో తన కూతురిపై కన్నేశాడు. ఓ రోజు ఏకంగా కౌగిలించుకునేందుకు ప్రయత్నాలు చేశాడు. దీంతో ఆ యువతికి కోపంతో వచ్చేంత పనైంది. ఇక ఆ మహిళ కూడా తన కూతురి జోలికి రావద్దు అంటూ హెచ్చరించింది.
అయినా వినని ఆ దుర్మార్గుడు ఆ అమ్మాయిని ఏదో రకంగా విసిగించే ప్రయత్నం చేశాడు. ఇక తల్లీ కూతుళ్లకు అతడిపై కోపం కట్టలు తెంచుకుంది. కూతురితో పాటు తల్లి అతడి హత్యకు ప్లాన్ వేసింది. ఇక ఓ రోజు ప్లాన్ ప్రకారం ఆ మహిళ ప్రియుడిని ఇంటికి రమ్మని పిలిచింది. మనోడు ఎగేసుకుంటూ వచ్చాడు. ఇక ఇంట్లోకి వెళ్లిన ఆ వ్యక్తిపై తన కూతురితో పాటు ఇద్దరు హత్యచేశారు. చాలా రోజులకు ఈ విషయం బయటకు తెలియటంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని తల్లీ కూతుళ్లను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. వయసుకొచ్చిన కూతురు ముందు తల్లి చేసిన ఈ వివాహేతర సంబంధం ఎంతట దారుణానికి తీసుకెళ్లిందో ఈ ఘటన చూస్తే అర్థమవుతోంది. ఇటీవల జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.