అమ్మ చుట్టము కాదు, అయ్య చుట్టము కాదు. అయినా మనీదే రాజ్యం అన్నాడు ఓ సినీ కవి. ఈ మాట అక్షర సత్యం. ఈ ప్రపంచాన్ని ముందుకి నడిపించే ఆరో భూతంగా ఇప్పుడు డబ్బు తయారైంది. కానీ.., కరెన్సీ కక్కుర్తిలో పడి.. కొందరు రక్తసంబధాలకు, మూడు ముళ్ల బంధానికి కూడా విలువ ఇవ్వడం లేదు. తాజాగా ఇలాంటి ఘటనే బెంగుళూరులో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరులో నివాసం ఉండే మమత, ముకుంద భార్యాభర్తలు. ఉన్నత కుటుంబం, ఆనందమైన జీవితం. ఇలా హ్యాపీగా సాగిపోతున్న వీరి జీవితంలో భార్య మమత అత్యాశ చిచ్చు రేపింది.
అధిక వడ్డీలు, అధిక కమీషన్స్ కు ఆశపడి.. మమత చిట్టీలు, వడ్డీ వ్యాపారం మొదలు పెట్టింది. కానీ.., ఆరు నెలలు తిరగకుండానే 20 లక్షలు నష్టం తేలింది. భార్య చేసిన తెలివి తక్కువ పనికి ముకుంద.. ముందుగా మండిపడ్డాడు. అయితే.., తరువాత ఆమెని ఓదార్చి బుద్ధి చెప్పాడు. ” దేవుడు చాలా మందికి ఇవ్వని ఓ మంచి జీవితం మనకి ఇచ్చాడు. ఉన్నంతలో మనం చాలా ఆనందంగా ఉన్నాము. కాబట్టి.. ఇంకెప్పుడు అత్యాశకి పోయి అనర్ధాలు తెచ్చుకోకు అని హితవు పలికాడు. కానీ., భార్య మమతకి ఇక్కడ అహం దెబ్బతింది.
భర్త చెప్పిన మంచి మాటలను ఆమె డామినేషన్ గా ఫీల్ అయ్యింది. మమత దీనిని తన స్నేహితురాలు తస్లీమాతో చెప్పుకోగా.. ఆమె భర్త అంతు చూడాలని సలహా ఇచ్చింది. అలా చేస్తే ఆస్తి కూడా నీదే అవుతుందనడంతో మమత ఒప్పుకుంది. కిరాయి రౌడీలకు రూ.10 లక్షలు అడ్వాన్స్ ఇచ్చి భర్త హత్యకు పురమాయించింది. పని పూర్తయితే మరో రూ. 30 లక్షలు ఇస్తానని బేరం కుదుర్చుకుంది. తన భర్త చేసే ఉద్యోగం, అతను ప్రయాణించే రూటు, కారు నెంబర్ అన్నీ డీటైల్స్ భార్య మమత హంతకులకు అందించింది.
తన భర్త ఎట్టి పరిస్థితుల్లో బతకకూడదని ఆమె పదే పదే చెప్పి… కిరాయి మూకని ఫీల్డ్ లోకి దింపింది. ఇక ముకుంద ఆఫీసు నుంచి బెంగళూరుకు వెళ్తుండగా దొడ్డబళ్లాపురం పారిశ్రామికవాడలో జెన్ కారులో వచ్చిన కొందరు దుండగులు అతని కారు అద్దాలు పగలగొట్టి దాడికి పాల్పడ్డారు. అయితే కారు డోర్‌లు లాక్ అయి ఉండడంతో క్షేమంగా తప్పించుకున్నాడు. ముకుందకు ఏమి జరిగిందో అర్థం కాక ప్రాణ భయంతో పరుగులు తీసుకుంటూ వెళ్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాడు.
ఇక పోలీసులు జెన్ కారు నంబరు ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్టు చేసి విచారించగా అసలు సంగతి తెలిసింది. పోలీసులు ఈ కేసులో మమతతో పాటు ఆమె స్నేహితురాలు తస్లీమా, సుపారి కిల్లర్లు మౌలా, సయ్యద్ సలీం, సయ్యద్ అబీబ్, నయీమ్ లను అరెస్ట్ చేశారు. మరి.. మంచి చెప్పిన భర్తనే దారుణంగా చంపించాలని చూసిన ఇలాంటి భార్యకి ఏ శిక్ష విధించాలి? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.