ఈ మద్య కాలంలో మానవ సంబంధాలు పూర్తిగా మంటకలిసి పోతున్నాయి. వివాహ బంధానికి మచ్చ తెచ్చే విధంగా భార్యాభర్తలు ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా అక్రమసంబంధాల కారణంగా పచ్చని కాపురాల్లో మంటలు చెలరేగుతున్నాయి. ఓ వ్యక్తి తాను ప్రేమించిన యువతి కోసం ఏకంగా తల్లీ, భార్యను దారుణంగా మోసం చేశాడు. వివరాల్లోకి వెళితే..
తిరువళ్లూరు జిల్లా పూనమల్లి ముత్తునగర్‌కు చెందిన శేఖర్ అనే వ్యక్తి గత కొంత కాలంగా ఫైనాన్స్ తో పాటు స్వీట్ స్టాన్ ని నడిపిస్తున్నాడు. ఈ మద్య భార్యాభర్తల మద్య మనస్పర్ధలు రావడంతో కొద్దిరోజుల క్రితం అతని భార్య మల్లిక పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ మద్యనే ఇరువురి పెద్దలు నచ్చజెప్పి తిరిగి భార్యను అత్తవారింటికి పంపించారు. ఇంటికి వచ్చిన మల్లిక బీరువాలో చెక్ చేసుకుంది. అందులో ఉంచిన 300 సవర్ల నగలు కనిపించలేదు. అదే విధంగా శేఖర్ తల్లికి చెందిన మరో 200 సవర్ల బంగారు నగలు, 2 బంగారు బిస్కెట్లు కనిపించకుండా పోవడంతో పూందమల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇంటి దొంగలే చేతివాటాన్ని ప్రదర్శించి ఉంటారని అనుమానం రావడం.. దానికి తగ్గట్టుగానే శేఖర్ ప్రవర్తనలో మార్పు రాడంతో అతడి కదలికలపై నిఘా పెట్టారు. మొత్తానికి పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టారు. ఇక విచారణలో పలు సంచలన నిజాలు బయటకు వచ్చాయి. బంగారు నగలను దొంగతనం చేసి ప్రియురాలు స్వాతికి ఇచ్చినట్లు శేఖర్ అంగీకరించాడు. దాంతో ఆమె కారు కొన్నట్లు తెలిపాడు. దీంతో పోలీసులు శేఖర్ అతని ప్రియురాలు స్వాతిని అరెస్ట్ చేసి కారుని సీజ్ చేశారు.
ఇటీవల భార్య పుట్టింటికి వెళ్లిన తర్వాత శేఖర్ కి స్వాతి అనే యువతితో పరిచయం అయ్యింది. ఆ పరిచయం అక్రమ సంబంధానికి దారి తీసింది. ఈ క్రమంలో శేఖర్ నుంచి స్వాతి లక్షల్లో డబ్బు స్వాహా చేసింది. తనకు బంగారం, కారు కొనివ్వాలని స్వాతి కోరడంతో వేరే మార్గం తెలియని శేఖర్ ఇంట్లో నగలను దొంగిలించి కొంత కానుకగా ఇచ్చినట్లు పోలీసులు నిర్ధారించారు. శేఖర్ సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు శేఖర్, స్వాతిలను అరెస్టు చేశారు. స్వాతి గతంలో పలువురిని ఈ విధంగానే మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. శేఖర్‌ను కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.