అతడో ఆర్ఎంపీ డాక్టర్. తన వైద్యం ద్వారా స్థానిక ప్రజలకు ఎంతో మందికి సేవలు అందించాడు. కట్ చేస్తే.. అదే డాక్టర్ ను తాజాగా కొందరు దుండగులు కత్తులతో నరికి చంపారు. అసలేం జరిగిందంటే?
ఏపీలో దారుణం చోటు చేసుకుంది. ఓ ఆర్ఎంపీ డాక్టర్ ను కొందరు దుండగులు నడిరోడ్డుపై దారుణంగా హత్య చేశారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అసలేం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. తిరుపతి జిల్లా వెంకటగిరి ప్రాంతంలో బాషా అనే వ్యక్తి ఆర్ఎంపీ డాక్టర్ గా పని చేస్తున్నాడు.
అయితే ఎవరో గుర్తు తెలియని దుండగులు సోమవారం ఉదయం బాషాను నడిరోడ్డుపై కత్తులతో వెంటాడారు. ఇక చివరికి బాషాను అందరూ చూస్తుండగానే కత్తులతో విచక్షణా రహితంగా నరికి అక్కడి నుంచి పరారయ్యారు. అయితే ఈ దుండగుల దాడిలో బాషా రక్తపు మడుగులో పడి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. వెంటనే స్పందించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాషా మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇక ఈ విషయం తెలుసుకున్న బాషా కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతరం మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.