తెలిసి తెలియని వయసులో ఈ కాలం పిల్లలు ప్రేమ పేరుతో జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. చిన్న వయసులోనే ప్రేమ అంటూ జులాయిగా తిరుగుతున్నారు. ఇక ఇంతటితో ఆగక కనిపెంచిన తల్లిదండ్రులను కాదని పెళ్లి వయసు రాకముందే ప్రేమించిన వాడితో పెళ్లికి రెడీ అవుతున్నారు. ప్రియుడితో పెళ్లికి తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో వారిని ఎదురించి పెళ్లి చేసుకోవడం లేదంటే, లేదంటే ఆత్మహత్య చేసుకోవడం చేస్తున్నారు. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ బాలిక ప్రియుడితో పెళ్లికి తల్లి అంగీకరించలేదని ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు. అసలు ఆ బాలిక ఏం చేసింది? ఈ ఘటన ఎక్కడ జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అది కొమురంభీం జిల్లా దాహెగాం మండలం రాళ్లగూడ అనే ఓ మారుమూల ప్రాంతం. ఇదే గ్రామంలో నాగపురి స్వరూప, మోహన్ దంపతులు నివాసం ఉంటున్నారు. పెళ్లైన కొన్నాళ్లకి వీరికి ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు జన్మించారు. దీంతో వీరి సంసారం సంతోషంగా సాగుతున్న తరుణంలోనే ఉన్నట్టుండి గతంలో భర్త మోహన్ మరణించాడు. దీంతో అప్పటి నుంచి స్వరూప తన ముగ్గురు పిల్లలను పోషిస్తూ సంసారాన్ని నెట్టుకొస్తుంది. ఇకపోతే తన చిన్న కూతురు అయిన శిరీష(16) ఇంటర్ ఫెయిల్ గత కొన్నిరోజుల నుంచి ఇంటి వద్దే ఉంటుంది. అయితే శరీష ఇదే గ్రామానికి చెందిన ఓ యువకుడిని గత 8 నెలల నుంచి ప్రేమలో పడింది. అతడు కూడా ఈ బాలికను ప్రేమిస్తున్నాడు. చిన్న వయసులో తండ్రి లేని సంసారంలో తల్లికి ఆసరాగా ఉండాల్సింది పోయి ప్రేమ పేరుతో జీవితాన్ని నాశనం చేసుకుంది.
అలా కొన్నాళ్ల తర్వాత శిరీష తను ప్రేమించిన వాడినే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయింది. ఇటీవల ఇదే విషయాన్ని తన తల్లికి కూడా చెప్పింది. కూతురు మాటలు విన్న తల్లి స్వరూప ఒక్కసారిగా షాక్ కు గురైంది. ఇంత చిన్న వయసులో ప్రేమ, పెళ్లి ఏంటి అని కూతురు శిరీషను గట్టిగా మందలించింది. దీంతో కూతురు శిరీష తీవ్ర మనస్థాపానికి గురైంది. ఈ క్రమంలోనే శిరీషకు ఏం చేయాలో తెలియక క్షణికావేశంలో ఇటీవల పురుగుల మందు తాగింది. ఈ విషయం తెలుసుకున్న తల్లి కూతురుని ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. కానీ ఫలితం లేకపోవడంతో శిరీష ప్రాణాలు కోల్పోయింది. ఈ విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. తెలిసి తెలియని వయసులో ప్రేమ అంటూ జీవితాన్ని నాశనం చేసుకుంటున్న ఇలాంటి వారికి మీరిచ్చే సూచనలు ఏంటి? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.