ఇటీవల దేశంలో గన్ కల్చర్ దారుణంగా పెరిగిపోతుంది. కొంతమంది కేటుగాళ్ళు అక్రమాయుధాల వ్యాపారంతో కోట్లు దండుకుంటున్నారు. తక్కువ ధరలో గన్స్ కొని గ్యాంగ్ స్టర్స్, చిల్లదొంగలు రెచ్చిపోతున్నారు.
ఇటీవల దేశ వ్యాప్తంగా గన్ కల్చర్ విపరీతంగా పెరిగిపోయింది. పోలీసుల వద్ద ఉండాల్సిన ఆయుధాలు కొంతమంది అక్రమార్కులు తమ ఆయుధాలుగా మలచుకుంటున్నారు. నిబంధనల ప్రకారం అనుమతి పొందిన ఆయుధాలు వాడేవారు కొంతమంది ఉంటే.. అడ్డదారులు ఆయుధాలు సంపాధిస్తు బెదిరింపులు, దాడులకు పాల్పపడేవారు కొందరు ఉన్నారు. ఒకప్పుడు పట్టణాల్లోనే గన్ కల్చర్ ఉండేది.. ఇప్పుడు పల్లెలకు కూడా పాకిపోయింది. రియల్ ఎస్టేట్, ఆర్థికపరమైన గొడవలు, ఇల్లీగల్ వ్యవహారాల్లో కొంతమంది దుండగులు గన్స్ తో బెదిరించడం.. చంపడం లాంటివి చేస్తున్నారు. ట్యూషన్ ఫీజు అడిగిన పాపానికి ఓ టీచర్ ని అతి దారుణంగా కాల్చి చంపారు స్టూడెంట్స్. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..
మధ్యప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. టీచర్ పదే పదే ట్యూషన్ ఫీజు అడుగుతున్నాడని విద్యార్థులు అతన్ని కాల్చి చంపారు. పోలీసుల కథనం ప్రకారం.. మద్యప్రదేశ్.. మొరెనా జిల్లాలోని జౌరా రోడ్డు పక్కన గిర్ వర్ సింగ్కుహ్వహా అనే టీచర్ కొంతకాలంగా కోచింగ్ సెంటర్ నడుపుతున్నారు. ఎంతోమంది విద్యార్థులకు ఆయన సెంటర్ లో కోచింగ్ ఇప్పించి ర్యాంక్ లు సాధించేలా కృషి చేస్తున్నారు. కొంతమంది విద్యార్థులు తమ వద్ద ఫీజు లేదని తర్వాత ఇస్తామని చెప్పేవారు. అలా ఇద్దరు స్టూడెంట్స్ చెప్పి సంవత్సాల నుంచి తప్పించుకుంటూ వచ్చారు. ఆ విద్యార్థులు కలిసినపుడు గిరి వర్ ఫీజు అడుగుతూ ఉండేవాడు.
తాము కలిసన ప్రతిసారి పదిమంది ముందు ఫీజు అడుగుతున్న టీచర్ పై విద్యార్థులు పగ పెంచుకున్నారు. ఎలాగైనా అతన్ని మట్టుపెట్టాలని నిర్ణయించుకున్నారు. స్థానికంగా మైదా ఫ్యాక్టరీ వద్ద టీచ్ ఉన్న విషయం గురించి తెలుసుకున్నారు. బైక్ పై ఉన్న విద్యార్థులను టీచర్ గమనించి దగ్గరకు వచ్చి మరోసారి ఫీజ్ ప్రస్తావన తీసుకువచ్చాడు. అప్పటికే స్టూడెంట్స్ తమతో తెచ్చుకున్న గన్ తో టీచర్ పై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని టీచర్ ని గ్వాలియర్ లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విద్యార్థులు కాల్పులు జరిపిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. వీటి ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.