ఆ యువతి పేరు దొంతుల మాలతి. హైదరాబాల్ లోని ఓ ప్రముఖ కాలేజీలో బీటెక్ చదువుతోంది. సెలవులు రావడంతో ఆ యువతి ఇటీవల తన స్వగ్రామానికి వెళ్లింది. మరుసటి రోజు మాలతి తల్లిదండ్రులతో పాటు కలిసి పొలానికి వెళ్లింది. వెళ్లడమే కాకుండా పొలం పనులు కూడా చేసింది. కానీ ఉన్నట్టుండి జరగరానిది జరిగి చివరికి ఆ యువతి ప్రాణాలతో లేకుండా పోయింది. తాజాగా చోటు చేసుకున్నఈ ఘటనతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అసలు ఆ యువతికి ఏం జరిగింది? ఉన్నట్టుండి మరణించడానికి దారి తీసిన పరిస్థితులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
రాజన్న సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని రగుడు. ఇదే గ్రామానికి చెందిన దొంతుల మాలతి (21) హైదరాబాద్ లోని ఓ ప్రముఖ కాలేజీలో బీటెక్ చదువుతోంది. మలతి ఇటీవల తన తల్లిదండ్రులను చూడడానికి తన స్వగ్రామానికి వెళ్లింది. ఇక మరుసటి రోజు మాలతి తల్లిదండ్రులతో పాటు కలిసి పొలానికి కూడా వెళ్లింది. ఆ తర్వాత తల్లిదండ్రులకు సాయం చేసేందుకు అక్కడ ఉన్న ఓ అంగీని వేసుకుని పనులు చేసింది. ఈ క్రమంలో మాలతి ధరించిన అంగీలో తేలు దాగి ఉంది. ఈ విషయం తెలియని మాలతి అలాగే పనులు చేసింది. అది మెల్ల మెల్లగా పలు చోట్ల కాటు వేసింది. ఏదో కరుస్తున్నట్లు అనిపించడంతో మాలతి తను వేసుకున్న అంగీ విప్పింది.
అందులో నుంచి ఓ విషపు తేలు బయటకు వచ్చింది. భయపడి పోయి ఇదే విషయం మాలతి తల్లిదండ్రులకు వివరించింది. వెంటనే వారి కుటుంబ సభ్యులు కరీంనగర్లోని ఓ ఆస్పత్రికి తరలించారు. అది విషం కలిగిన తేలు కావడంతో మాలతి చికిత్స పొందుతూ మంగళవారం మరణించింది. కూతురు మరణించడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. వయసుకొచ్చిన అమ్మాయి ప్రాణాలు కోల్పోవడంతో వారి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.