నేటి కాలంలో కొందరు భర్తలు వివాహేతర సంబంధాల్లో పాలు పంచుకుని సొంత కాపురాన్ని పక్కకు పెడుతున్నారు. ఇలా ఎంతో మంది భర్తలు భార్యలను కాదని పరాయి మహిళలతో అక్రమ సంబంధాలు పెట్టుకుని చివరికి కట్టుకున్న భార్యను మోసం చేస్తున్నారు. ఇక అసలు విషయం బయటపడడంతో హత్యలు చేయడం లేదంటే, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ భార్య ఆత్మహత్యకు పాల్పడింది.
పోలీసుల కథనం ప్రకారం.. సిద్దిపేట జిల్లాలోని చిన్నకూడురులో శ్రీశైలం, రాజ్యలక్ష్మి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి 2015లో వివాహం జరిగింది. ఇక పెళ్లైన కొంత కాలానికి వీరికి ఇద్దరు కుమారులు జన్మించారు. పెళ్లైన కొన్ని రోజులు ఈ దంపతులు సంతోషంగానే జీవించారు. కానీ రోజులు మారే కొద్ది భర్త వక్రమార్గం వైపు అడుగులు వేసి మరో మగాడి పెళ్లానికి దగ్గరయ్యాడు. దీంతో శ్రీశైలం కట్టుకున్న భార్యను కాదని అదే గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధాన్ని నడిపించాడు. అలా కొంతకాలం పాటు శ్రీశైలం తన చీకటి వ్యవహారం భార్యకు తెలియకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నాడు.
ఇక ఎట్టకేలకు తన భర్త సాగిస్తున్న అసలు విషయం భార్యకు తెలిసింది. దీంతో భార్య భర్తను నిలదీసి ప్రశ్నించింది. నోట్లో నీళ్లు నమిలిని భర్త అదేం లేదంటూ తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఇక భర్త ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో ఇటీవల భార్య రాజ్యలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు భార్యాభర్తలిద్దరి కౌన్స్ లింగ్ ఇచ్చి పంపించారు. ఇక నుంచైన భర్త ప్రవర్తనలో మార్పు వస్తుందని భార్య రాజ్యలక్ష్మి ఆశపడింది. కానీ శ్రీశైలం మళ్లీ మొదటి దారిలోనే అడుగులు వేశాడు.
అయితే ఇదే విషయమై భర్త శ్రీశైలం భార్యపై చేయి చేసుకున్నాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి లోనైన రాజ్యలక్ష్మి ఆదివారం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కూతురు సూసైడ్ చేసుకున్న విషయం రాజ్యలక్ష్మి తల్లిదండ్రులకు తెలియడంతో కన్నీరు మున్నీరుగా విలపించారు. రాజ్యలక్ష్మి భర్త శ్రీశైలం తీరుతోనే మా కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని, అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.