అప్సర కేసులో తాజాగా మరో ట్విస్ట్ నెలకొంది. నిందితుడు సాయికృష్ణ పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెల్లడించినట్లు తాజాగా శంషాబాద్ డీసీపీ మీడియాకు తెలిపారు.
సంచలనంగా మారిన అప్సర కేసులో నిందితుడు సాయికృష్ణకు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు అతడిని చర్లపల్లి జైలుకు తరలించారు. అయితే పోలీసుల విచారణలో భాగంగా నిందితుడు సాయి కృష్ణ సంచలన విషయాలు వెల్లడించినట్లు శంషాబాద్ డీసీపీ తాజాగా మీడియాకు తెలిపారు. అతడు పొంతనలేని సమాధానాలు చెప్పాడని వివరించారు. ఇంతకు పోలీసుల విచారణలో అతడు చెప్పిన విషయాలు ఏంటంటే?
ప్రియురాలు అప్సర పెళ్లి చేసుకోవాని కోరినందుకు సాయికృష్ణ ఆ యువతి దారుణంగా కొట్టి చంపిన విషయం తెలిసింది. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని ఎవరికీ దొరకకుండా ఉండేందుకు మ్యాన్ హోల్ లో పడేసి మిస్సింగ్ కేసుగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. ఇక అసలు నిజాలు వెలుగులోకి రావడంతో పోలీసులు నిందితుడు సాయికృష్ణను అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే, పోలీసుల విచారణలో నిందితుడు సాయికృష్ణ సంచలన విషయాలు వెల్లడించినట్లు తాజాగా శంషాబాద్ పోలీసులు తెలిపారు.
దీంతో పాటు పొంతనలేని సమాధానాలు చెబుతున్నాడని కూడా వివరించారు. డీసీపీ మాట్లాడుతూ.. నేను అప్సరను ఉద్దేశ పూర్వకంగా హత్య చేయలేదని, అసలు నేను ఎప్పుడూ ఆమెతో శారీరకంగా కూడా కలిసింది లేదని నిందితుడు సాయికృష్ణ చెప్పినట్లు డీసీపీ తెలిపారు. ఇదిలా ఉంటే.., శుక్రవారం రాత్రి పోలీస్ స్టేషన్ లో నిందితుడు సాయికృష్ణ హల్ చల్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. గట్టిగా ఏడుస్తూ నేను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడని సమాచారం.