అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. భార్య చనిపోయిన గంటకే భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికులను కంటతడి పెట్టిస్తుంది. అసలు ఈ ఘటన ఎక్కడ జరిగింది? భార్య ఎలా చనిపోయింది? భర్త ఆత్మహత్య చేసుకోవడానికి దారి తీసిన పరిస్థితులు ఏంటనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. అది అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పరిధిలోని కొంకాపల్లి ప్రాంతం. ఇక్కడే విజయ్ కుమార్ (47), తులసీలక్ష్మీ (45) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి చాలా ఏళ్ల కిందటే వివాహం జరిగింది. అయితే భర్త ఓఎన్జీసీ సబ్ కాంట్రాక్టర్ గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అలా పెళ్లైన కొంత కాలం పాటు ఈ దంపతుల కాపురం సాఫీగానే సాగుతూ వచ్చింది.
అలా కొన్నాళ్ల తర్వాత ఈ దంపతులకు ఓ కుమారుడు జన్మించాడు. ఇక కుమారుడుని చదివించుకుంటూ దంపతులు సంతోషంగా ఉంటున్నారు. ఇదిలా ఉంటే గత మూడు నెలల కిందట భార్య తులసీలక్ష్మీ మెదడుకి శస్త్రచికిత్స జరగడంతో ఇంట్లోనే ఉంటుంది. దీంతో అప్పటి నుంచి వీరి కుటుంబం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు గురైంది. దీంతోనే ఆర్థికపరమైన కష్టాలు ఎదురవ్వడంతో భర్త విజయ్ కుమార్ అక్కడ, ఇక్కడ అప్పులు చేశాడు. కుటుంబం పరిస్థితి ఊహించని రీతిలో మారిపోవడంతో విజయ్ కుమార్ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. అయితే ఎప్పటిలాగే ఈ దంపతులు ఈ శనివారం రాత్రి తిని పడుకున్నారు.
ఇక తెల్లవారుజామున భర్త విజయ్ కుమార్ నిద్రలేచాడు. ఉదయం 7 గంటలు అయినా భార్య నిద్ర లేవలేదు. ఏం జరిగిందని భర్త విజయ్ కుమార్ భార్య తులసీ లక్ష్మీని నిద్రలేపే ప్రయత్నం చేశాడు. కానీ భార్య ఎంతకు లేవలేదు. అతనికి కొద్దిసేపటి తర్వాత తెలిసిందేందంటే.. భార్య చనిపోయిందని. ఈ విషయం తెలుసుకున్న భర్త తట్టుకోలేకపోయాడు. భార్య లేదు, ఇక రాదు అన్న చేదు నిజాన్ని జీర్ణించుకోలేక కన్నీటి పర్యంతమయ్యాడు. ఈ క్రమంలోనే భర్త విజయ్ కుమార్ భార్య లేని జీవితం నాకు వద్దనుకుని ఇంటి రెండవ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న కుమారుడు గుండెలు బరువెక్కేలా ఏడ్చాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. భార్య చనిపోయిన గంటకే భర్త ఆత్మహత్య చేసుకోవడంతో స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.