గత కొంత కాలంగా దేశ వ్యాప్తంగా విపరీతంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. మద్యం సేవించి వాహనాలు నడపడం, అతివేగం, నియంత్రణ కోల్పోయి వాహనాలును నడపడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాలను అరికట్టేందుకు ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి.
ఇటీవల దేశంలో ఎక్కడ చూసినా పదుల సంఖ్యల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రమాదాలు అరికట్టేందుక ప్రభుత్వం ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా బూడిదలో పోసిన పన్నీరుమాదిరగానే అవుతుంది. మద్యం సేవించి వాహనాలు నడపడం, అతివేగం, నియంత్రణ కోల్పోయి వాహనాలును నడపడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో ఎంతో మంది అమాయకులు తమ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.. వేల మంది వికలాంగులుగా మారుతున్నారు. ఈ ప్రమాదాలు ఎక్కువగా డ్రైవర్ల నిర్లక్ష్యం వల్లనే జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. తాజాగా మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళితే.
మధ్యప్రదేశ్ సిద్ది జిల్లా సరిహద్దుల్లో ఓ ట్రక్కు అతివేగంగా దూసుకు వచ్చి ఆగివున్న మూడు బస్సులను బలంగా ఢీ కొట్టింది. దాంతో ఓ బస్సు రెండు ముక్కలైంది. మిగతా బస్సులు కూడా నుజ్జు నుజ్జు అయ్యాయి.. ఈ ప్రమాదంలో 12 మంది అక్కడిక్కడే మృతి చెందగా, 39 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. వీరిలో మరోపది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. కేంద్రమంత్రి అమిత్ షా బహిరంగా సభకు వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ట్రక్కు ప్రమాదంలో గాయపడ్డవారిని రేవా, సిద్ది ఆస్పత్రులకు తరలించారు. ప్రమాదం జరిగిన విషయం తెలియగానే మధ్యప్దేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ హుటాహుటిన ఆస్పత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. ఈ సందర్భంగా సీఎం చౌహాన్ మాట్లాడుతూ.. మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.10 లక్షలు, క్షతగాత్రులకు 2 లక్షలు, గాయపడినవారికి రూ.1 ఎక్స్ గ్రేషియా చెల్లిస్తామని చెప్పారు.
సాత్నలో షబ్రీ జయంతి సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహించారు.. ఈ సభకు కేంద్రమంత్రి అమిత్ షా, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ ముఖ్య అతిథిలుగా పాల్గొన్నారు. ఈ సభకు భారీగా జనాలు తరలివచ్చారు. సభ ముగిసిన తర్వా సాయంత్రం 5 గంటల ప్రాంతంలో సిద్దికి బస్సుల ద్వారా జనాలు బయలుదేరారు. ఈ క్రమంలో మోహానియా వద్ద టీ కోసం బస్సులను రోడ్డు పక్కన నిలిపారు. బస్సులో ఉన్నవారికి అల్పాహారం అందిస్తున్న సమయంలో ఓ ట్రక్కు అతి వేగంగా దూసుకు వచ్చి బస్సులను ఢీ కొట్టింది.
బస్సులు నుజ్జునుజ్జు కావడంతో అందులో ఉన్నవారు మరణించారు.. చాలా మంది గాయపడ్డారు. ఈ ఘటన రాత్రి 9 గంటల ప్రాంతంలో జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేంద్ర మంత్రి అమిత్ షా, సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుంటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Over a dozen people died in a road accident in Madhya Pradesh, while around 35 were seriously injured. The horrific accident took place due to a truck hitting two buses on the Sidhi-Rewa road. These buses were carrying people returning from Union HM Amit Shah’s rally@Gurjarrrrr pic.twitter.com/68UcBhCZgy
— TIMES NOW (@TimesNow) February 25, 2023